ETV Bharat / state

ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా పోలీస్‌ పరీక్షలకు శిక్షణ

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థుల భవిష్యత్‌ కోసం ఇంటర్ బోర్డు అడుగులు వేస్తోంది. పోలీసు శాఖలో స్థిరపడాలనుకునే వారికి.... ఉచితంగా శిక్షణ అందిస్తోంది. 20 కళాశాలల్లో పోలీసు ఉద్యోగానికి పోటీపడేలా విద్యార్థులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేస్తోంది.

police-training-for-inter-students-at-mahaboobnagar
ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా పోలీస్‌ పరీక్షలకు శిక్షణ
author img

By

Published : Dec 5, 2020, 2:19 PM IST

ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుని పోలీసు శాఖలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఇంటర్‌ బోర్డు అండగా నిలుస్తోంది. కోచింగ్‌ కోసం వేలు ఖర్చుపెట్టలేని విద్యార్థుల భవితకు భరోసా కల్పిస్తోంది. త్వరలో నిర్వహించే పోలీసు ఎంపికలకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో విద్యార్థులకు... పోలీసు పరీక్షలకు అవసరమైయ్యే శిక్షణ అందిస్తోంది. ప్రతి జిల్లాలో సుమారు వంద మందిని ఎంపికచేసి... రాతపరీక్షతో పాటు, దేహదారుఢ్య పరీక్షలకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు.

ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా పోలీస్‌ పరీక్షలకు శిక్షణ

అర్హత కలిగిన వారికి..

మహబూబ్‌నగర్‌లోని బాలుర జూనియర్‌ కళాశాలలో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారితో పాటు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి ఎంపిక చేశారు. అర్హత కలిగిన 95 మంది బాలురు, 70 మంది బాలికలకు ఉచితంగా తర్ఫీదు ఇస్తున్నారు. పోలీసుశాఖతో పాటు ఆర్మీ తదితర పోటీ పరీక్షల్లోనూ ప్రతిభ చూపేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. తమ శిక్షణతో చాలామంది భవిష్యత్‌కు బంగారు బాటలు పడతాయని అధికారులు చెబుతున్నారు.

బాలురతో సమానంగా..

ఉచితంగా శిక్షణ తమకు ఓ వరమని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టి... సుదూర ప్రాంతాలకు వెళ్లలేని తమకు ఇదో గొప్ప అవకాశమని చెబుతున్నారు. బాలికలను తక్కువగా చూడకుండా బాలురతో సమానంగా శిక్షణ అందిస్తున్నారని విద్యార్థినులు ధన్యవాదాలు చెబుతున్నారు.

త్రివిధ దళాల్లో చేరేందుకు అవసరమైన శారీరక శిక్షణ ఉచితంగా అందించడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సరైన మార్గనిర్దేశం లేక ఉద్యోగాలు సాధించలేక పోయామని.. ఇప్పుడు పట్టుదలతో తప్పక ఉద్యోగం పొందుతామని ధీమాగా చెబుతున్నారు. గ్రామీణ విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.

ఇంటర్‌ తర్వాత విద్యార్థులు గందరగోళానికి గురవకుండా.. సరైన మార్గంలో నడిపేందుకు ఇలాంటి శిక్షణలు ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు

ఇదీ చూడండి: రైతు సంఘాలతో కేంద్రమంత్రుల చర్చలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.