మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో నిర్వహించే పోచమ్మ బోనాల ఉత్సవాలను లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసి మంగళవారం నిర్వహించారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ పూజలు చేశారు. కురుమ యాదవులు అమ్మవారికి.. అంబలిని నైవేద్యంగా సమర్పించారు. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో పెద్ద బోనం కుండను అమ్మవారికి తొలి బోనంగా ఇచ్చారు.
ఇదీ చదవండి: అంజన్న రూపంలో గొర్రెపిల్ల... గ్రామస్థుల పూజలు