ETV Bharat / state

మహబూబ్​నగర్​ సర్పంచ్​లకు మోదీ లేఖ... ఎందుకంటే...? - ప్లాస్టిక్​ వ్యర్థాల అవగాహనపై సర్పంచులకు మోదీ లేఖ

'ప్లాస్టిక్​ రహిత భారతాన్ని నిర్మిద్దాం. దీనిపై గ్రామస్థులందరితో ప్రమాణం చేయించి స్థానిక పాలనా సంస్థల సహకారంతో భాగస్వాములను చేయండి. ఎలా ఓడీఎఫ్​ ఇండియాను సాధించుకున్నామో ప్లాస్టిక్​ రహిత భారతాన్ని నిర్మిద్దాం' అంటూ భారత ప్రధాని మోదీ మహబూబ్​నగర్​ జిల్లాలో 462 మంది సర్పంచ్​లకు లేఖ రాశారు. బహిరంగ మల విసర్జన రహిత భారత దేశాన్ని సాధ్యం చేయడంలో వారి కృషిని అభినందించారు.

మోదీ లెటర్​
author img

By

Published : Sep 12, 2019, 11:44 PM IST

మహబూబ్​నగర్​ జిల్లాలోని 462 మంది సర్పంచ్​లు, 1,065 స్వచ్ఛ అవార్డు గ్రహీతలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. సెప్టెంబర్​ 11 నుంచి అక్టోబర్​ 2 వరకు 'స్వచ్ఛతా హీ సేవ' కార్యక్రమం చేపట్టాలని వారికి పేరు పేరునా లేఖలు పంపారు. జాతిపిత మహాత్మా గాంధీ స్వప్నమైన బహిరంగ మల విసర్జన రహిత భారతదేశాన్ని సాధ్యం చేయడంలో కీలక పాత్ర వహించి సహకారాన్ని అందించినందుకు ప్రశంసించారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ విషయంలో కూడా ఇంతే స్ఫూర్తితో కృషి చేస్తారనే నమ్మకముందని తన లేఖలో పేర్కొన్నారు.

ప్లాస్టిక్​ వ్యర్థాలపై అవగాహన కల్పించండి

సమగ్ర స్వచ్ఛత కార్యక్రమంలో ప్రతి ఒక్కరికీ ప్లాస్టిక్​ వాడకం వల్ల కలిగే నష్టాల పట్ల అవగాహన కల్పించాలని తన లేఖలో సూచించారు. తమ తమ గ్రామాల్లో ప్లాస్టిక్​ వ్యర్థాలను సేకరించి... వాటి సురక్షిత నిర్మూలనకు అక్టోబర్​ 2న గ్రామస్థులతో ప్రమాణం చేయించాలని పేర్కొన్నారు. ఈ విధంగా దీపావళి నాటికి మన గ్రామాలను ప్లాస్టిక్​ వ్యర్థాల నుంచి విముక్తి చేయవచ్చని తెలిపారు. ఎలాగైతే ఓడీఎఫ్​ ఇండియాను సాధించుకున్నామో... అలాగే ప్లాస్టిక్​ రహిత భారత్​ నిర్మాణానికి కట్టుబడదామని అన్నారు.

ఇదీ చూడండి : వంతెన లేక ఒక కిమీ దూరం పది కిలోమీటర్లైంది..

Intro:TG_Mbnr_11_12_Modi_Letters_To_Surpunches_AV_TS10052
Contributor: T.Chadraasheker(Mahabubnagar-9390592166)
Center: Mahabubnagar
( ) సెప్టెంబర్‌ 11 నుంచి అక్టోబర్‌ 2 వరకు నిర్వహించే 'స్వచ్చతా హీ సేవ' చేపడుదామని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 462 మంది సర్పంచ్‌లకు, 1065 మంది స్వచ్చగ్రహితలకు పేరు పేరునా లేఖలు పంపారు.Body:మాహాత్మ గాంధీ స్వప్నమైన బహిరంగ మలవిసర్జన రహిత భారతదేశాన్ని సాధ్యం చేయడంలో మీలో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర వహించి విలువైన సహకారాన్ని అందించినందుకు ప్రశంనీయులని.. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ విషయంలో కూడా అంతే చిత్తశుద్దితో కృషి చేస్తారని పూర్తి నమ్మకం ఉందంటూ ప్రధాని నరేంద్రమోదీ లేఖలలో పేర్కొన్నారు.

సమగ్ర స్వచ్చత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికీ సింగల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ తాలూకు నష్టాలు, ప్రమాదాల పట్ల అవగాహన కలిగించండి అంతేకాక, మీ గ్రామాన్ని ప్లాస్టిక్‌ రహితంగా చేస్తామని, ప్లాస్టిక్‌ వ్యర్థాలన్నిటినీ తమ పరిసరాల నుంచి సేకరించి.. స్థానిక పాలన సంస్థల సహకారంతో ఆ వ్యర్థాలను సురక్షితంగా నిర్మూలించేటట్లు కృషి చేస్థామని అక్టోబరు 2వ తేదిన మీ గ్రామస్థుల చేత మీరు ప్రమాణం చేయవచ్చని.. ఈ విధంగా మన గ్రామాలను ఈ దీపావళి నాటికే ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి విముక్తి చేయవచ్చని కోరారు. Conclusion:ఎలగైతే ఓడీఎఫ్‌ ఇండియాను నిర్మించుకున్నామో, అదే విధంగా మన పరిసరాలను నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించి. ప్లాస్టిక్‌ కాలుష్య రహిత భారతదేశాన్ని నిర్మించడానికి కట్టుబడదామని లేఖలో పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.