దేహదారుఢ్య పరీక్షల ఏర్పాట్లు పరిశీలన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పోలీస్ రిక్రూట్మెంట్ మొదలైంది. 21,466 మంది అభ్యర్థులు రాత పరీక్షలో అర్హత సాధించారు. జిల్లా క్రీడా మైదానంలో దేహదారుఢ్య పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారులతో జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సమావేశమై దిశానిర్దేశం చేశారు.
అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీల్లో మాత్రమే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. దేహదారుఢ్య పరీక్షల్లో ఈసారి పోలీసు అధికారులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. సెన్సర్లు, చిప్‌లు, సీసీ కెమెరాల ద్వారా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టారు.