ETV Bharat / state

లాక్​డౌన్​ సడలింపులతో ఎవరి పనుల్లో వారు - latest news on people are coming on rodas by lockdown relaxations

​ప్రభుత్వం లాక్​డౌన్​ నుంచి కొన్నింటికి సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా వ్యాప్తంగా రోడ్లపై జన సంచారం కనిపించింది. నిత్యావసర దుకాణాలు, ఔషధ దుకాణాలు, మద్యం దుకాణాలు తెరవడం వల్ల ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు.

people are coming on rodas by lockdown relaxations
లాక్​డౌన్​ సడలింపులతో ఎవరి పనుల్లో వారు
author img

By

Published : May 7, 2020, 2:25 PM IST

లాక్​డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడం వల్ల ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో రోడ్లపై జనం రద్దీ మరింత పెరిగింది. పాలు, పండ్లు, కూరగాయలు, ఔషధ దుకాణాలతో పాటు ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల మేరకు అన్ని దుకాణాలు తెరిచారు. పట్టణాల్లో 50 శాతం మాత్రమే దుకాణాలు తెరవాలన్న ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఒక్కో దుకాణానికి ఒక్కో నెంబర్ కేటాయించి బేసి, సరి సంఖ్యల ఆధారంగా దుకాణాలు తెరిచేలా రంగం సిద్ధం చేశారు.

గ్రామాలు, మండల కేంద్రాల్లో అన్ని దుకాణాలు తెరచుకోవడం, పట్టణాల్లో 50 శాతం దుకాణాలు తెరచుకోవడం వల్ల రహదారులపై జనం రద్దీ తీవ్రమైంది. చాలా చోట్ల జనం భౌతిక దూరాన్ని పాటించడం లేదు. మాస్కులు ధరించకుండానే రోడ్లపైకి వస్తున్నారు.

జోగులాంబ గద్వాల జిల్లా మినహా మిలిగిన 4 జిల్లాల్లో కంటైన్​మెంట్ జోన్లు ఎత్తివేయడం వల్ల వాహనాల రద్దీ పెరిగింది. బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. చాలా చోట్ల ప్రజలు రద్దీగా ఉండటం, మాస్కులు లేకుండా కొనుగోళ్లు జరపటం, భౌతిక దూరం పాటించకపోవటం వంటివి గమనించారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని దుకాణదారులను, వినియోగదారులను హెచ్చరించారు.

మద్యం దుకాణాల వద్ద బారులు..

దాదాపు నెలన్నర తర్వాత మద్యం దుకాణాలు తెరచుకోవడం వల్ల ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో మద్యం ప్రియులు దుకాణాల ఎదుట బారులుతీరారు. ఉదయం 8 గంటల నుంచే క్యూలైన్​లలో నిల్చున్నారు. దుకాణాల ఎదుట భౌతిక దూరం పాటించేలా దుకాణాల యజమానులు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు తప్పని సరిగా ధరించాలని కోరుతూ బోర్డులు పెట్టారు.

5 జిల్లాల్లో 164 దుకాణాలకు గానూ.. 7 దుకాణాలు మినహా అన్ని షాపులు తెరిచారు. ఐదు జిల్లాల్లోనూ దుకాణాల ముందు ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా పెంచిన ధరల విషయంలో దుకాణదారులు ఒకే విధానాన్ని పాటించడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డిమాండ్, నిల్వలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో ధర చెప్పి అధిక ధరలకు అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం అమ్మేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మద్యం అమ్మినా.. ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే ఎక్కువకు అమ్మినా దుకాణాలు మూసివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదీచూడండి: విశాఖ గ్యాస్​లీక్​ ఘటనపై కిషన్​రెడ్డి ఆరా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.