ETV Bharat / state

PALLE PRAGATHI: పల్లెప్రగతిని ప్రభావవంతంగా చేపట్టాలి.. - telangana varthalu

నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పల్లెప్రగతి పదిరోజుల పాటు కొనసాగనుంది. అయితే మూడు విడతల్లో ఎదురైన అనుభవాలు, అడ్డంకులు, అమలు తీరులను సమీక్షిస్తూ..ఈసారి మరింత ప్రభావవంతంగా పల్లెప్రగతిని చేపట్టాలనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పారిశుద్ధ్యం విద్యుత్, శిథిలావస్థకు చేరిన ఇళ్ల కూల్చివేత, ఇంకుడు గుంతల్లాంటి అంశాలపై ఈసారి ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక పల్లెప్రగతంటే కేవలం పది రోజుల కార్యక్రమంగా చూడకుండా నిరంతరం కొనసాగేలా అధికార యంత్రాంగం పనిచేయాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

PALLE PRAGATHI: పల్లెప్రగతిని ప్రభావవంతంగా చేపట్టాలి..

author img

By

Published : Jul 1, 2021, 4:17 AM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమాలు ఇవాళ్టి నుంచి 10రోజుల పాటు అన్ని జిల్లాల్లో కొనసాగనున్నాయి. గత మూడు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి పనులు గ్రామాల రూపురేఖల్ని పూర్తిగా మార్చేశాయి. కాని ఇప్పటికీ చేపట్టాల్సిన పనులు చాలానే మిగిలి ఉన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3విడతల్లో ఎదురైన అడ్డంకులు, లోపాలను అధిగమిస్తూ ఈసారి పల్లెప్రగతిని విజయవంతం చేయాల్సిన అవసరం అటు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం పైన ఉంది. గడిచిన మూడువిడతల్లో దాదాపుగా అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు, పల్లెపకృతి వనాలు, రైతువేదికలు, హరితహారం కింద మొక్కలు నాటడం, ఇంటింటికీ చెత్త సేకరణ, ట్రాక్టర్లు, ట్రాలీల కొనుగోలు దాదాపుగా పూర్తయ్యాయి. కాని స్థల వివాదాలు, స్థలాల కొరత కారణంగా కొన్నిచోట్ల డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు పూర్తి కాలేదు. ఇంటింటికీ చెత్త సేకరణ, చెత్తను వేరు చేయడం, ఎరువుగా మార్చడం లాంటివి అమలుకు నోచుకోవడం లేదు. దీనిపై ఈసారి అధికారులు ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది.

నిర్లక్షం ప్రాణాల మీదకు తెస్తోంది..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశం శిథిలావస్థకు చేరిన ఇళ్లు. గత పల్లెప్రగతిలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను దాదాపుగా కూల్చివేసినా.. వివాదాలున్న చోట పంచాయతీ సిబ్బంది కూల్చకుండానే వదిలేస్తున్నారు. ఈ నిర్లక్ష్యమే జనం ప్రాణాల మీదకు తెస్తోంది. గత వానాకాలంలో కురిసిన వర్షాలకు మట్టిమిద్దెలు, పాత ఇండ్లు కూలి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పదిమందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇటీవలే ఓ గ్రామసర్పంచ్ సైతం శిథిలావస్థకు చేరిన ఇంట్లో నిద్రిస్తూ మట్టి మిద్దె కూలడంతో మనుమడితో సహా ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఈసారి శిథిలావస్థకు చేరిన ఇళ్ల విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది

విద్యుత్​ సమస్యలు పరిష్కరించాలి..

పల్లెప్రగతిలో ప్రధానంగా దృష్టిసారించాల్సిన మరో సమస్య విద్యుత్. వేలాడే తీగలు, కూలేందుకు సిద్ధంగా ఉన్న కరెంటు స్తంభాలను గత పల్లెప్రగతిలో మార్చారు. కాని కొత్తగా ఏర్పడిన కాలనీలు, రెండు పడక గదుల ఇళ్ల కాలనీలు, ఊరికి దూరంగా ఉన్న కాలనీల్లో చాలా చోట్ల విద్యుత్ సమస్యలు ఇప్పటకీ అపరిష్కృతంగానే ఉన్నాయి. కేవలం పల్లెప్రగతి జరిగిన రోజులు మినహా మిగిలిన రోజుల్లో వాటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. వీటికితోడు ఇటీవల విద్యుత్ తీగలు తగిలి ప్రమాదంలో పశువులు, మనుషులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సన్నాహక సమావేశాల్లోనూ ప్రజాప్రతినిధులు విద్యుత్ సమస్యలనే ఎక్కువగా ప్రస్తావించారు. దీనిపై ఈసారి అధికారులు కాస్త గట్టిగానే దృష్టి పెట్టాలి. ఇక ఉపాధి హామీ పథకం కింద రోడ్లపై గుంతల్ని పూడ్చాలని, పారిశుద్ధ్యాన్ని నిరంతరం కొనసాగించాలని ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు.

ఈ సారైనా లక్ష్యాన్ని సాధిస్తారా..

పల్లెప్రగతిలో నిర్లక్ష్యానికి గురైన మరో అంశం.. ఇంకుడు గుంతలు. మహబూబ్​నగర్ జిల్లాలో మూడు విడతల్లో చేపట్టాల్సిన ఇంకుడు గుంతల లక్ష్యం లక్ష అయితే... చేపట్టినవి కేవలం 40వేలే. నారాయణపేట జిల్లాలో 70వేల లక్ష్యానికి చేపట్టినవి కేవలం 12వేలే. వనపర్తి జిల్లాలో లక్షా 20వేల లక్ష్యానికి కేవలం11వేలు మాత్రమే చేపట్టారు. ఐదు జిల్లాల్లో ఇంకుడు గుంతలకు సంబంధించి ఇదే పరిస్థితి. ఈ సారైనా లక్ష్యానికి అనుగుణంగా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. పంచాయతీ నిధుల్లో 10శాతం పచ్చదనానికి ఖర్చు చేయాలి. అది అమలు కావడం లేదు. ఇక పంచాయతీ అభివృద్ధి పనులు, ఉపాధీ హామీ పనులు, ప్రభుత్వ పథకాల అమలు సహా అనేక విధులతో గ్రామ కార్యదర్శులు తీవ్రంగా పని ఒత్తిడికి లోనవుతున్నారు. వీరికి క్షేత్రస్థాయిలో సహాయకులను నియమించాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. గ్రామాల్లో మల్టీపర్పస్ కార్మికులను నియమిస్తున్నా.. డంపింగ్ యార్డు నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని వారు కోరుతున్నారు.

నిరంతరం కొనసాగించాలి..

పల్లె ప్రగతి అనగానే ఏటా పదిరోజుల పాటు గ్రామాల్లో హడావుడీ కొనసాగుతోంది. కానీ ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా పల్లె ప్రగతిలో గుర్తించిన అన్ని సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: PRAGATHI: రాష్ట్రవ్యాప్తంగా పదిరోజుల పాటు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.