ETV Bharat / state

ఉద్యోగ ప్రకటనలతో సంబంధం లేదు... ఇక్కడ ఎప్పటినుంచో ఉచిత శిక్షణ - పాలమూరు యూనివర్సిటీ స్టడీ సర్కిల్

ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగానే పోటీపరీక్షల శిక్షణ కేంద్రాలకు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. ప్రభుత్వ సంస్థలు కూడా ఉచిత శిక్షణ అందించేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ ఉద్యోగ ప్రకటనలతో సంబంధం లేకుండా వెనకబడిన పాలమూరు జిల్లా యువతను పోటీపరీక్షల్లో నెగ్గేలా చేసే లక్ష్యంతో 2009 నుంచే స్టడీసర్కిల్ ను నిర్వహిస్తోంది పాలమూరు విశ్వవిద్యాలయం. ఓ వైపు చదువు కొనసాగిస్తూనే రోజుకు 5 గంటల పాటు పోటీ పరీక్షల సిద్దమయ్యే అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తోంది. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారిన స్టడీ సర్కిల్​పై కథనం.

palamuru-university
palamuru-university
author img

By

Published : Mar 17, 2022, 3:03 PM IST

ఉద్యోగ ప్రకటనలతో సంబంధం లేదు... ఇక్కడ ఎప్పటినుంచో ఉచిత శిక్షణ

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగార్థులకు పోటీపరీక్షలపై శిక్షణ ఇవ్వాలని ఉపకులపతులకు ఆదేశాలిచ్చినట్లు ఇటీవలే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కానీ 2009 నుంచే పోటీపరీక్షల కోసం విద్యార్థులను సిద్ధంచేసే స్టడీ సర్కిల్​ను నిర్వహిస్తోంది పాలమూరు విశ్వవిద్యాలయం. ఉద్యోగ ప్రకటనతో సంబంధం లేకుండా ఈ విద్యా సంవత్సరం అక్టోబర్ నుంచే ఉచిత శిక్షణ అందిస్తోంది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటలకు వరకు, సెలవుదినాల్లో రోజంతా శిక్షణ కొనసాగుతోంది. 250మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.

అందుబాటులో స్టడీ మెటీరియల్స్​

వివిధ సబ్జెక్టుల్లో నిపుణులైన అధ్యాపకులతో కోచింగ్ ఇస్తున్నారని, గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు ఉపయోగపడేలా అన్ని అంశాలను నేర్పుతున్నారని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు పోటీ పరీక్షలకు సైతం సిద్ధమవుతున్నారు. పోటీపరీక్షలకు కావాల్సిన స్టడీ మెటీరియల్​ను సైతం గ్రంథాలయంలో అందుబాటులో ఉంచారు. శిక్షణ కొనసాగుతున్న నేపథ్యంలో గ్రంథాలయ వేళల్ని సైతం పెంచారు. శిక్షణ పొందుతున్న విద్యార్థిణులకు అనుకూలంగా వసతిగృహంలో రాకపోకల వేళలను సడలించారు. విద్యార్థులు పోటీపరీక్షలకు సిద్ధమయ్యే వాతావరణాన్ని విశ్వవిద్యాలయంలో కల్పిస్తున్నారు.

ఎక్కువ సమయం సన్నద్ధత కోసం...

విశ్వవిద్యాలయం నిర్వహించే ఈ స్టడీసర్కిల్​లో విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. నామమాత్రపు బోధన రుసుము తీసుకుని అధ్యాపకులు విద్యార్థులకు బోధిస్తున్నారు. ఆ నామమాత్రపు రుసుమును విశ్వవిద్యాలయం నిధుల నుంచి చెల్లిస్తున్నారు. ఇక పుస్తకాల కోసం దాతలు సహకరిస్తున్నారు. వాస్తవంగా ఇదే శిక్షణ బయట పొందాలంటే లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ పీయూలో ఉచితంగా అందించడం వారికి ఎంతో తోడ్పాటు నిస్తోంది. భోజనం వసతి సౌకర్యాలు సైతం అక్కడే ఉంటాయి కాబట్టి ఎక్కువ సమయం పరీక్షల సన్నద్ధత కోసం కేటాయించే అవకాశం విద్యార్థులకు దక్కుతోంది.

వారికి అండగా ఉండాలన్న ధ్యేయంతో..

వెనకబడిన పాలమూరు జిల్లా విద్యార్థులు పోటీపరీక్షల్లో నెగ్గుకు రావాలని, ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడాలన్నఉద్దేశంతోనే స్టడీ సర్కిల్​ను ప్రారంభించినట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ భూమయ్య తెలిపారు. యూనివర్సీటికీ వచ్చే వాళ్లు అత్యధిక శాతం గ్రామీణ, నిరుపేద కుటుంబాల విద్యార్థులేనని వారికి అండగా ఉండాలన్న ధ్యేయంతో ప్రత్యేక చొరవ తీసుకుని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి విశ్వవిద్యాయంలో ఉచిత శిక్షణ ఇవ్వాలని ఆదేశాలొచ్చిన నేపథ్యంలో నిధులొస్తే కొత్త పుస్తకాలతో పాటు రాష్ట్రంలోనే పేరుగాంచిన అధ్యాపకులతో శిక్షణ ఇప్పిస్తామన్నారు.

ప్రభుత్వమే ఉచిత శిక్షణ ఇవ్వాలని ఆదేశించడంతో ఇన్నేళ్లుగా ఇస్తున్న శిక్షణను మరింత విస్తృతం చేసే అవకాశాలున్నాయి. ఎక్కువమందికి పుస్తకాలు, స్టడీ మెటిరియల్, ఫ్యాకల్టీని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఇదీ చదవండి : సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.... రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.