ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సహకార ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 76 సహకార సంఘాలుండగా... ఇప్పటికే ఆరు ఏకగ్రీవమ్యయాయి. మొత్తం 259 వార్డులు ఏకగ్రీవం కాగా... 662 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 1652 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ ప్రారంభం నుంచే కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సగటున 70శాతం వరకు పోలింగ్ నమోదైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో 77.92, జోగులాంబ గద్వాల 72.72, నారాయణపేట 74.29, మహబూబ్నగర్ 70, వనపర్తిలో 75.81 పోలింగ్ నమోదైంది.
పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులకు చక్రాల కుర్చీలు లేక ఇబ్బందులు పడ్డారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.
ఇవీ చూడండి:శంషాబాద్లో 1100 గ్రాముల బంగారం పట్టివేత