మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో రైతులు విక్రయానికి తీసుకొచ్చిన ఉల్లిని వినియోగదారులు నేరుగా కొనుగోలు చేశారు. కిలో ఉల్లిని గరిష్ఠంగా రూ.15కు కొనుక్కున్నారు. వినియోగదారుల డిమాండ్‌కు సరిపడే ఉల్లి లేకపోవడం, రైతులకు పంట దిగుబడి పడిపోవడం, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు ఉల్లి రాకపోవడంతో... ఇదే అదనుగా వ్యాపారులు రూ. 20కు తగ్గకుండా విక్రయిస్తున్నారు. నెలరోజుల్లో ధరలు పెరగడం రైతులకు కాస్త ఊరటగా ఉన్నా... వినియోగదారులకు మాత్రం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
ఇదీ చదవండిః ఈ చెట్టుకు ఏడు రకాల మామిడి కాయలు