ETV Bharat / state

ఎన్​కౌంటర్​పై ఎన్​హెచ్​ఆర్సీ ఆరా.. నేడు నిందితుల గ్రామాల సందర్శన

author img

By

Published : Dec 8, 2019, 5:41 AM IST

Updated : Dec 8, 2019, 7:33 AM IST

దిశ నిదింతుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ చేపట్టిన విచారణ కొనసాగుతోంది. తొలిరోజు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రిలో నిందితుల మృతదేహాలు, చటాన్‌పల్లి వద్ద ఘటనా స్థలాలను పరిశీలించిన కమిషన్ సభ్యులు... ఇవాళ నిందితుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కూడా సేకరించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు నిందితుల స్వగ్రామాలైన జక్లేర్, గుడిగండ్ల గ్రామాలను సందర్శించనున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో నిందితుల శవపరీక్ష నివేదికలను వైద్యబృందం.. కోర్టుకు లేదా ఎన్​హెచ్​ఆర్సీకి సమర్పించనుంది.

నేడు నిందితుల గ్రామాల సందర్శన
ఎన్​కౌంటర్​పై ఎన్​హెచ్​ఆర్సీ ఆరా..

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ కొనసాగుతోంది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఎన్‌కౌంటర్‌ కేసును సుమోటోగా స్వీకరించిన ఎన్​హెచ్​ఆర్సీ.. దర్యాప్తు కోసం నలుగురు సభ్యులతో కూడిన నిజనిర్ధరణ బృందాన్ని రాష్ట్రానికి పంపింది. బృంద సభ్యులు మృతదేహాలను పరిశీలించేందుకు వెళ్లగా శవపరీక్షలు నిర్వహించిన ఫోరెన్సిక్ బృందం అందుబాటులో లేరు. దీంతో ఆస్పత్రి ఛాంబర్‌లో అధికారులతో సమావేశమై ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరు... కేసు పూర్వపరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య బృందం రావడం వల్ల తిరిగి శవాగారంలోకి వెళ్లి ఎన్​హెచ్​ఆర్సీ నియమనిబంధల మేరకు శవపరీక్ష నిర్వహించారా లేదా పరిశీలించారు. పరీక్షల దృశ్యాలను చిత్రీకరించారా? ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అన్న అంశాలను విచారించారు. శవపరీక్షలో తేలిన అంశాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఎన్ఆ​హెచ్​ఆర్సీ ఆరా..

మహబూబ్‌నగర్‌ నుంచి ఎన్​హెచ్​ఆర్సీ కమిటీ.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన చటాన్‌పల్లికి చేరుకుంది. దిశను నిందితులు పెట్రోల్ పోసి తగలబెట్టిన చోటును కమిటీ పరిశీలించింది. అనంతరం ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాన్ని కూడా అధికారులు పరిశీలించారు. ఎదురుకాల్పులకు దారితీసిన పరిస్థితులు, ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అక్కన్నుంచి కమిటీ నేరుగా హైదరాబాద్‌కు వెళ్లింది.

సోమవారం వరకు పర్యటన

ఎన్‌కౌంటర్‌పై మానవహక్కులు సహా పలు ప్రజా సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నందున ఎన్​హెచ్​ఆర్సీ కమిటీ ఇవాళ కుటుంబ సభ్యుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటుందని తెలుస్తోంది. జక్లేర్, గుడిగండ్ల గ్రామాలకు వెళ్తారని సమాచారం. పోస్టుమార్టం నివేదికపై సంతకాల కోసం.. ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజు నిందితుల కుటుంబసభ్యులను పోలీసులు మహబూబ్‌నగర్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం వారిని స్వగ్రామాల్లో వదిలేశారు. ఈనెల 9న ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ జరగనున్నందున ఆ అంశాలను ఎన్​హెచ్​ఆర్సీ పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం వరకూ కమిటీ రాష్ట్రంలోనే పర్యటించనున్నట్లు తెలుస్తోంది. దిల్లీ వెళ్లిన అనంతరం తుది నివేదికను ఎన్​హెచ్​ఆర్సీకి సమర్పించనుంది.

మరో రెండు రోజులు..

శవపరీక్ష జరిగిన సమయంలో చిత్రీకరించిన దృశ్యాలు మహబూబ్ నగర్ జిల్లా న్యాయమూర్తికి అందించాలన్న హైకోర్టు అదేశాల మేరకు.. శవపరీక్ష ప్రాథమిక నివేదిక సహా వీడియోలను పోలీసులు న్యాయమూర్తికి అందించినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి శవపరీక్ష నివేదిక సమర్పించడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. కేసు కోర్టు పరిధిలోకి వెళ్లినందున శవపరీక్ష నివేదికను హైకోర్టుకు లేదా ఎన్​హెచ్​ఆర్సీకి అందించే అవకాశం ఉంది.

ఎన్​కౌంటర్​పై ఎన్​హెచ్​ఆర్సీ ఆరా.. నేడు నిందితుల గ్రామాల సందర్శన

ఇవీ చూడండి:దిశ నిందితుల మృతదేహాలు తరలింపు

Intro:Body:Conclusion:
Last Updated : Dec 8, 2019, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.