పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో పర్యావరణ, అటవీశాఖ వ్యవహారశైలిపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పులు జరిగితే రెగ్యులేటరీ బాడీ ఎందుకు స్పందించలేదని పేర్కొంది. చర్యలకు ఆదేశించేంత వరకూ అధికారుల్లో చలనం రాదా అని ప్రశ్నించింది. ప్రాజెక్టుపై అక్టోబర్ 1 లోగా నివేదిక ఇవ్వాలని కేఆర్‌ఎంబీ, అటవీ, పర్యావరణశాఖకు ఎన్జీటీ ఆదేశించింది.
ఇదీ చూడండి: palamuru:పాలమూరు- రంగారెడ్డి పనులు జరుగుతున్నాయని ఎన్జీటీకి నివేదిక