మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి గత పాలకవర్గం గడువు ముగియడం వల్ల కొత్తగా పాలకవర్గానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రతిపాదనలు పంపారు. ఈమేరకు ప్రభుత్వం వారిని ఎంపిక చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాలో ప్రధాన మార్కెట్ అయిన బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన అధ్యక్షులుగా కాట్రపల్లి లక్ష్మయ్య ఎంపికకాగా.. ఉపాధ్యక్షులుగా నారాయణ గౌడ్‌తో పాటు 14 మంది సభ్యులతో కూడిన పాలకవర్గాన్ని నియమించినట్టు రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ పాలకవర్గం ఏడాదిపాటు కొనసాగనుందని పేర్కొన్నారు. నూతన పాలక వర్గం ఎంపిక కోసం కృషి చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితోపాటు జిల్లా మంత్రులకు పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందించి.. మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆస్తుల నమోదును వేగంగా పూర్తి చేయాలి: పమేలా సత్పతి