వనపర్తిలో అగ్నిమాపక కేంద్రం ప్రారంభం మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం కొత్తకోటలో నూతన అగ్నిమాపక కేంద్రం ఏర్పాటైంది. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 21 అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేశామని హోంమంత్రి పేర్కొన్నారు.
కేసీఆర్ దిల్లీలో సత్తా చాటుతారు..
ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రానున్న రోజుల్లో కేంద్రంలో కూడా చక్రం తిప్పుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి :పరీక్ష రాస్తూనే మృత్యు ఒడికి..