కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా రాజీ మార్గం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి సూచించారు. రాజీ చేసుకోదగ్గ కేసుల్లో కక్షిదారులు ఈ మార్గాన్ని పాటించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యాయ సేవా సదన్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ను ఏర్పాటు చేశారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని వివరించారు. అనంతరం కొన్ని కేసులను న్యాయమూర్తి పరిష్కరించారు.
కరోనా నేపథ్యంలో మార్చి నుంచి నిలిచిపోయిన లోక్ ఆదాలత్ సేవలు 10 నెలల అనంతరం పునఃప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 26 వేల కేసులు పెండింగ్‌లో ఉండగా.. 1750 కేసులను గుర్తించి నోటీసులు పంపినట్లు జడ్జి పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆయా కోర్టుల్లో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన కేసుకు కోర్టు ఫీజు తిరిగి చెల్లించడంతో పాటు అప్పీలుకు వెళ్లే సమస్య ఉండదని వెల్లడించారు.
ఇదీ చదవండి: 'రాష్ట్రంలో డొమెస్టిక్ ఎయిర్పోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకోండి'