ETV Bharat / state

నిద్రలేవని మహబూబ్​నగర్ మున్సిపల్​ యంత్రాంగం - undefined

వానాకాలం మొదలైంది. సీజన్​తో పాటే వ్యాధుల విజృంభన ప్రారంభమైంది. ఇప్పటికే మహబూబ్​నగర్ జిల్లాలో విషజర్వాల కేసులు నమోదవుతున్నాయి. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ, ప్రజారోగ్యశాఖ అధికారులు గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లుగా కనిపించట్లేదు. ఖాళీ ప్రదేశాల్లో నీటి నిల్వ, క్రమం తప్పకుండా మురికి కాల్వలను శుభ్రం చేయడం, చెత్త పేరుకు పోకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నారు.

నిద్రలేవని మహబూబ్​నగర్ మున్సిపల్​ యంత్రాంగం
author img

By

Published : Jul 5, 2019, 4:41 PM IST

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో గత మూడేళ్లుగా వానాకాలంలో సీజనల్ విషజ్వరాలు విజృంభిస్తున్నా... వాటి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం ప్రజారోగ్యశాఖ అధికారులు దారుణంగా విఫలమవుతున్నారు. వానాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా దోమలు, వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టడం లేదు. ముఖ్యంగా మహబూబ్​నగర్ పట్టణంలోని శివారు కాలనీలు, విలీన గ్రామాలు పారిశుద్యం విషయంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మురుగు కాల్వలు, సీసీ రోడ్ల వ్యవస్థ అభివృద్ధి కాకపోవడం వల్ల వర్షపు నీరు, మురుగు నీరు ఇళ్ల మధ్యలోని ఖాళీ స్థలాల్లో చేరి దోమలు, ఈగలు ఇతర క్రిమి కీటకాలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఈ కారణంగా ఆ ప్రాంతాల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని... ఏటా ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.

ఇక పట్టణంలో పారిశుద్యం సైతం అధ్వాన్నంగా మారింది. ముఖ్యంగా ప్రేమ్ నగర్, సద్దలగుట్ట, టీడీ గుట్ట, రాజేంద్ర నగర్, బీకే రెడ్డి కాలనీ, శాసాహెబ్ గుట్ట, వీరన్నపేట, రామయ్య బౌలి, హబీబ్ నగర్, పాత పాలమూరు సహా మురికి వాడల్లో గత మూడేళ్లుగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా లాంటి వ్యాధులు అధికంగా నమోదయ్యాయి. ఈ ప్రాంతాలపై మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉన్నా....ఎలాంటి చర్యలు లేవు.

అధికారులు మాత్రం.. మే నుంచి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెబుతున్నారు. ఇప్పటికే నీటి నిల్వ అయ్యే ప్రాంతాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. రోజుకు 8 వార్డుల చొప్పున 41 వార్డుల్లో దోమల పొగ వేయడం, ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా తీసుకుని... ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు.

మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో నమోదవుతున్న సీజన్ వ్యాధుల కేసులు జనంలో ఆందోళన కలిస్తున్నాయి. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలో డెంగూ కేసులు 52 నమోదు కాగా.. 7 చికెన్ గున్యా, ఒక మెదడు వాపు కేసు నమోదైంది. ఏటా జూలై నుంచి సెప్టెంబర్ వరకూ డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, విరేచనాల కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా నివారణ చర్యలు తక్షణం చేపట్టాలని మహబూబ్ నగర్ పట్టణ వాసులు కోరుతున్నారు.

నిద్రలేవని మహబూబ్​నగర్ మున్సిపల్​ యంత్రాంగం

ఇవీ చూడండి: నేటి నుంచి కొత్త జడ్పీల పాలన

sample description

For All Latest Updates

TAGGED:

municipality
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.