మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్లోని కురుమూర్తి ఆలయంలో రాజగోపుర నిర్మాణానికి ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
దేవాలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఆలయానికి రాజగోపురం తలమానికంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ సుధాకర్, ఎంపీపీ హర్షవర్ధన్, జడ్పీటిసి సభ్యురాలు రాజేశ్వరి, ఆలయ కమిటీ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: యునెస్కో గుర్తింపునకు అడుగు దూరంలో రామప్ప ఆలయం..