ETV Bharat / state

'మీ పోలీసు - మీ ఆత్మబంధువు'తో పరిష్కారం : రెమా రాజేశ్వరి - she teams in mahabubnagar in lock down

లాక్​డౌన్​ వల్ల గృహ హింస కేసులు ఎక్కువవుతున్నాయని మహబూబ్​నగర్​ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. మహిళల ఇళ్ల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకునేందుకు మీ పోలీసు-మీ ఆత్మ బంధువు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

mobile she teams in mahabubnagar to save women from domestic violence
మహబూబ్​నగర్​లో షీ టీమ్స్
author img

By

Published : May 9, 2020, 12:36 PM IST

శాంతి భద్రతల పరిరక్షణకై పోలీసు శాఖ పూర్తిస్థాయి నిబద్ధతతో పని చేస్తోందని మహబూబ్​నగర్​ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. ముఖ్యంగా మహిళల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్​ స్టేషన్ ఆధ్వర్యంలో 'మీ పోలీసు-మీ ఆత్మబంధువు' కార్యక్రమాన్ని నిర్వహించారు. బాధితుల ఇంటి వద్దకే వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నారు. వేధింపులకు గురవుతున్న మహిళలు.. షీ టీమ్స్​కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి కోరారు.

"మీ పోలీసు-మీ ఆత్మబంధువు" ఏర్పాటు చేసిన గంటల్లోనే షీ టీమ్​కు భర్త వేధింపులకు సంబంధించిన ఫిర్యాదు రావడం గమనార్హం. లాక్​ డౌన్​లో గృహ హింస కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.