ETV Bharat / state

పగిలిన మిషన్ భగీరథ పైపు లైను, నీరు వృథా

అసలే ఎండాకాలం. తాగేందుకే నీరు దొరకని ఈ సమయంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పైప్ లైను పగిలి తాగు నీరు వృథాగా పోయింది. ఈ సంఘటన మహబూబ్​నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం లాల్​కోట చౌరస్తాలో జరిగింది.

పగిలిన మిషన్ భగీరథ పైపు లైను, నీరు వృథా
author img

By

Published : Mar 30, 2019, 3:49 PM IST

పగిలిన మిషన్ భగీరథ పైపు లైను, నీరు వృథా
మహబూబ్​నగర్ జిల్లా మన్యంకొండలో మిషన్ భగీరథ పైపులైను ధ్వంసమైంది. చిన్నచింతకుంట మండలం లాల్​కోట చౌరస్తాలో గేటు మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా పైపు పగిలి పెద్ద ఎత్తున నీరు చిమ్మింది. జాతీయ రహదారిపై ఫౌంటన్​లా వందల అడుగుల ఎత్తుకు నీరు చిమ్మింది.

చాలా సేపు మంచినీరు వృథాగా పోయి... చుట్టపక్కన పంటపొలాలు, రోడ్డుపైన వరదలా పారింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్వాహకులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన అధికారులు నీటి వృథాను అరికట్టారు.పైప్ లైన్ లీకేజీకి కారణం నిర్వాహకుల పర్యవేక్షణ లోపమేనని గ్రామస్థులు ఆరోపించారు.

ఇవీ చదవండి:దేశంలో బడితే ఉన్నోడిదే బర్రె : కేటీఆర్

Intro:Tg_Mbnr_07_30_Bhagiratha_waterpipe_dameg_G3 మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింత కుంట మండలం లాల్ కోట చౌరస్తాలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి తాగు నీరు వృధా అవుతుంది.

Body:మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ లో శుద్ధి చేయబడిన తాగునీరు సరఫరా చేసే ప్రధాన మిషిన్ భగీరథ పైపులైను ధ్వంసం అయింది. చిన్నచింతకుంట మండలం లాల్ కోట చౌరస్తాలో గెట్ మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా పైపు పగిలి పెద్ద ఎత్తున నీరు వృధా అయ్యింది. వృధా అవుతున్న నీటిని చుట్టుపక్కల ఉన్న రైతుల పొలాలకు పారాయి . వృధా అవుతున్న నీరు రోడ్డుపైకి తున ఎగిసి పడుతూ ఉండగా యువకులు కుర్రకారు కేరింతలు కొడుతూ వృధా అవుతున్న నీటిలో ఆడుకున్నారు కాసేపటికి విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్వాహకులు నీటి సరఫరా నిలిపి వేసి నీటి వృధాను అరికట్టారు

Conclusion:మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ తో పెద్ద ఎత్తున తాగునీరు వృధా అయింది నిర్వాహకుల పర్యవేక్షణ లోపంతో ఇలా జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.