మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. లాక్డౌన్లో భాగంగా పట్టణ ప్రజలకు అవసరమైన కూరగాయలు, మటన్, చికెన్ మార్కెట్లను వేర్వేరుగా ఏర్పాటు చేశామని తెలిపారు. వినియోగదారులు సామాజిక దూరం పాటించాలని మంత్రి సూచించారు.
యాచకులకు, వలస కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి సౌకర్యాలు కల్పించి, ఆకలి తీర్చాలని అధికారులను, స్థానిక ప్రజా ప్రతినిధులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం సామాజిక దూరం పాటించి... ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని మంత్రి సూచించారు.
ఇవీచూడండి: వారి కోసం ప్రత్యేకంగా 1000 ఆర్టీసీ బస్సులు