ETV Bharat / state

'పాలమూరులో ఐదు రూపాయలకే దహనసంస్కారాలు' - మంత్రి శ్రీనివాస్​గౌడ్​ వార్తలు

మహబూబ్​నగర్ పట్టణంలో కేవలం ఐదు రూపాయలకే దహన సంస్కారాలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Telangana news
మహబూబ్​నగర్​ జిల్లా వార్తలు
author img

By

Published : May 23, 2021, 10:03 PM IST

అనారోగ్యం, ఇతర కారణాలతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు పేదలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. పాలమూరు పట్టణంలో ఐదు రూపాయల వ్యయంతోనే అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు. అందుకోసం గ్యాస్​ ఆధారిత శ్మశానవాటికను ఏర్పాటు చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి వివరించారు.

రాష్ట్రంలోనే కొవిడ్ వ్యాక్సిన్​, రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపారు. దీనిని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం బాధాకరమన్నారు. జిల్లాలో కరోనాకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, అవసరమైతే వైద్యులు ఇంటి వద్దకే వచ్చి చికిత్స అందిస్తున్నారని వివరిచారు. ఎవరూ ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో బిక్షాటన చేసుకునేవారికి ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు.

అంతకుముందు మహబూబ్‌నగర్‌ పట్టణంలో 10 లక్షల రూపాయల వ్యయంతో భారత్ స్కౌట్స్, గైడ్స్ నూతన భవన సమావేశ మందిరానికి శంకుస్థాపన, కలెక్టర్ చౌరస్తాలో చేపట్టిన మూడు రహదారుల పనులను ప్రారంభించి.. పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ది పనుల పురోగతులను పరిశీలించారు.

ఇదీ చూడండి: కేంద్రం వల్లే వ్యాక్సినేషన్​ జాప్యం : మంత్రి హరీశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.