వానాకాలం పంట కార్యాచరణ ప్రణాళిక, నూతన వ్యవసాయ విధానంపై మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరగతిన క్లస్టర్ల వారీగా సమావేశాలు పూర్తి చేయాలని... అనంతరం గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. కొంతమంది రైతుల ఆధార్‌కార్డులు.. బ్యాంకు ఖాతాలకు అనుసంధానం కానందువల్ల రుణమాఫీ డబ్బులు జమ కాలేదని తెలిపారు. రైతుబంధు అధ్యక్షులు తక్షణమే వివరాలను సేకరించి పంపించాలని ఆదేశించారు.
రెండు జిల్లాలకు అవసరమైయ్యే ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని... ఎక్కడైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన మేరకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేసి నూతన వ్యవసాయ విధానాన్ని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. సర్పంచ్ స్థాయి మొదలుకొని జిల్లా స్థాయి వరకు ఉద్యమ స్ఫూర్తితో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.