ETV Bharat / state

'పాలమూరు మినీట్యాంక్ బండ్​ను నక్లెస్ రోడ్​లా చేస్తాం'

author img

By

Published : Nov 17, 2020, 9:18 AM IST

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్​పై ఏర్పాటు చేసిన ఎల్​ఈడీ లైట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. త్వరలో నక్లెస్ రోడ్​లాగా తయారు చేస్తామని తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేయబోయే శిల్పారామంతో పాటు పరిసరాల నమూనా 3డీ వీడియోను ఆయన విడుదల చేశారు.

minister srinivas goud starts lighting on tankabund in mahabubnagar
'పాలమూరు మినీట్యాంక్ బండ్​ను నక్లెస్ రోడ్​లా చేస్తాం'

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు మిని ట్యాంక్‌ బండ్‌ను సుందరంగా తీర్చిదిద్దనున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ట్యాంక్‌ బండ్‌పై విద్యుత్‌ కాంతులతో మిరుమిట్లు గొలిపేలా నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లను ఆయన ప్రారంభించారు. ఒకప్పుడు పెద్ద చెరువు కట్టపై పగలు నడవటమే కష్టంగా ఉండేదని.. ఇరిగేషన్‌, పర్యాటక శాఖలను సమన్వయపరిచి పెద్ద చెరువును అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో ట్యాంక్‌ బండ్‌ను నక్లెస్‌ రోడ్‌లా తయారు చేయటంతో పాటు.. చెరువులో వేలాడే వంతెనను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. సమీపంలో ఏర్పాటు చేయబోయే శిల్పారామంతో పాటు.. పగలు, రాత్రి ట్యాంక్‌ బండ్‌ పరిసరాలు ఎలా ఉండనున్నాయో... మినీ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయనున్న అభివృద్ధి పనుల నమూనా 3డీ వీడియోను మంత్రి విడుదల చేశారు.

ఇదీ చదవండి: చైన్​స్నాచింగ్​ ముఠా అరెస్ట్​... 7 లక్షల బంగారం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.