మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటుచేయనున్న విమానాశ్రయం విషయంపై ఎమ్మెల్యేలు, అధికారులతో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లో సమీక్షించారు. విమానాశ్రయ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు ఎక్కడెక్కడున్నాయో అడిగి తెలుసుకున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్, గూగుల్ చిత్రాల ద్వారా స్థలాలు పరిశీలించారు. మహబూబ్‌నగర్, మూసాపేట్, దేవరకద్ర, భూత్పూర్ మండలాల్లో అధికారులు పరిశీలించిన స్థలాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధ్యాసాధ్యాలపై కూలంకశంగా చర్చించారు. రాంచంద్రపురం, చౌదర్‌పల్లి గ్రామాల పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు అనువైన ప్రాంతాలుగా ఉన్నట్టు తేల్చారు. మిగతాప్రాంతాల్లో కొండలు, గుట్టలు, కాల్వలు ఉన్నందున విమానాశ్రయం ఏర్పాటు చేస్తే ఇబ్బందులు ఎదరైయ్యే అవకాశాలు ఉన్నట్టు అధికారులు మంత్రికి వివరించారు.
పాలమూరులో విమానాశ్రయంపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష - airport in mahaboobnagar
మహబూబ్‌నగర్ జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్షించారు. విమానాశ్రయం కోసం ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించిన స్థలాల వివరాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాంచంద్రపురం,చౌదర్‌పల్లి గ్రామాల పరిధి అనువుగా ఉంటుందని అధికారులు తెలిపారు.