ETV Bharat / state

లాక్​డౌన్​పై మంత్రి పరిశీలన..దుకాణాదారులపై కన్నెర్ర

మహబూబ్​నగర్​లో అమలవుతున్న లాక్​డౌన్​ను పరిశీలించేందుకు మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పట్టణ ప్రధాన వీధుల్లో కలియ తిరిగారు. సర్కారు ఆదేశాలను పాటించకుండా వ్యాపార లావాదేవీలు చేస్తున్న వారిపై ఆయన మండిపడ్డారు. బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు.

Minister Srinivas Goud outraged shoppers who don't care about lockdown in Mahabubnagar
లాక్​డౌన్​ అమలును పరిశీలించిన మంత్రి శ్రీనివాస్​గౌడ్​
author img

By

Published : Mar 24, 2020, 8:24 AM IST

Updated : Mar 24, 2020, 9:21 AM IST

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో అమలవుతున్న లాక్​డౌన్​ను పరిశీలించేందుకు మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ గడియారం చౌరస్తా తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వ ఆదేశాలను దిక్కరిస్తూ నిర్లక్ష్యంగా వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్న దుకాణాదారులపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

లాక్​డౌన్​ అమలును పరిశీలించిన మంత్రి శ్రీనివాస్​గౌడ్​

రాష్ట్రం మొత్తం కరోనా వ్యాప్తి పట్ల ఆందోళనకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ ఇలాంటి నిర్లక్ష్య ధోరణి సరికాదని... వైరస్​ వ్యాప్తి ప్రారంభమైందంటే నియంత్రించడం కష్టమని ఆయన అన్నారు. పట్టణ పౌరులు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని.. ఎవ్వరు కూడా ఇంటి నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయరాదని సూచించారు. మంత్రి వెంట కలెక్టర్ ఎస్ వెంకటరావు, కమిషనర్ సురేందర్ తదితరులు ఉన్నారు.

ఇవీ చదవండి :లాక్​డౌన్​పై సీఎం సమీక్ష.. పటిష్ట అమలుకు ఆదేశం

Last Updated : Mar 24, 2020, 9:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.