ప్రతి ఓటరును కలిసి తెరాసకు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేయాలని.. ఒక్క స్థానమే కదా అని నిర్లక్ష్యం చేయొద్దని పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్ పార్టీ శ్రేణులకు సూచించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెరాస కార్యాలయంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం నిర్వహించారు.
పార్టీ బలోపేతానికి, కార్యకర్తల ఎదుగుదలకు ఎన్నికల విజయం దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. పార్టీని కాపాడుకునేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఆరేళ్లలో ప్రజలకు తెరాస ఏం చేసిందో ఓటర్లకు వివరించి చెప్పాలన్నారు.
కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఓటర్లను కలవాలన్నారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్లను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి కోరారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. పోటెత్తిన భక్తులు