ETV Bharat / state

'కొత్త ఏడాదిలో పట్టణ ప్రజలకు ప్రతిరోజు తాగునీరు'

మహబూబ్​నగర్​ పురపాలికలో నూతన సంవత్సర కానుకగా ప్రతిరోజు తాగునీరు అందిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. భవిష్యత్తులో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. పాలమూరుకు మరో జాతీయ రహదారి మంజూరైందని మంత్రి వెల్లడించారు.

minister srinivas goud gives new year gift to mahaboobnagar people
కొత్త ఏడాదిలో జిల్లా ప్రజలకు ప్రతిరోజు తాగునీరు : శ్రీనివాస్​ గౌడ్
author img

By

Published : Dec 31, 2020, 11:18 AM IST

కొత్త ఏడాదిలో మహబూబ్​నగర్​ పట్టణ ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందిస్తామని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు. గతంలో వారానికోసారి తాగునీరు అందేదని ఆయన అన్నారు. జిల్లా రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన సభకు మంత్రి హాజరయ్యారు. పురపాలికలో ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్​, హోటళ్లకు తాగు నీటి కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. పాలమూరు ప్రజలు సురక్షితమైన మిషన్ భగీరథ నీళ్లు వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మరో జాతీయ రహదారి :

జిల్లాకు జడ్చర్ల నుండి దేవసూగూరు వరకు మరో జాతీయ రహదారి వస్తోందని... నూతన సంవత్సరంలో ప్రకటన వెలువడుతుందని తెలిపారు. కొత్త రహదారి జిల్లాకు మరో మణిహారం లాంటిదని అభివర్ణించారు.

ఎయిర్​పోర్టు రానుంది :

రాయచూర్ -మహబూబ్​నగర్ మధ్యలో ఎయిర్ పోర్టు రానుందని మంత్రి తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే రాయచూరుకు గంట, హైదరాబాద్​కు గంట 45 నిమిషాల్లో చేరుకోవచ్చని చెప్పారు. మహబూబ్​నగర్ మహానగరంగా మారనుందని అశాభావం వ్యక్తం చేశారు. అధికారులు, ఉద్యోగుల సహకారంతో పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందిందని వివరించారు. జనవరిలో వెయ్యి కోట్లతో కొత్త పరిశ్రమ జిల్లాకు రానుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లా చుట్టుపక్కల నిర్మిస్తున్న దివిటిపల్లి, ఏనుగొండ, ఎస్వీఎస్​, జర్నలిస్ట్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తక్షణమే అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.

నియామక పత్రాలు అందజేత:

ఐదేళ్ల క్రితం పట్టణానికి వారానికోసారి తాగునీరు వచ్చేదని, ఐదేళ్లలో శరవేగంగా అభివృద్ధి చెందడం ఆశ్చర్యమేస్తోందని శాసనమండలి సభ్యుడు దామోదర్ రెడ్డి అన్నారు. మంత్రి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. గ్రూప్ 4 ద్వారా జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులుగా కొత్తగా ఉద్యోగాలు పొందిన 75 మందికి మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు.

ఇదీ చూడండి: ధరణి, రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.