ETV Bharat / state

త్వరలోనే సమగ్ర వ్యవసాయ విధానం: మంత్రి నిరంజన్​ రెడ్డి

సమగ్ర వ్యవసాయ విధానంపై త్వరలోనే సీఎం కేసీఆర్​ ప్రకటన చేస్తారని మంత్రి నిరంజన్​ రెడ్డి తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి పథకానికి ఎట్టిపరిస్థితుల్లోనూ నష్టం జరగనివ్వబోమని తెల్చి చెప్పారు. వచ్చే ఏడాది రైతులందరికీ పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

distribute-green-manure-seeds-in-mahabubnager
త్వరలోనే సమగ్ర వ్యవసాయ విధానం: మంత్రి నిరంజన్​ రెడ్డి
author img

By

Published : May 15, 2020, 2:20 PM IST

మహబూబ్‌నగర్‌లోమంత్రులు నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​ గౌడ్​ రైతులకు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు పంపిణీ చేశారు. వ్యవసాయశాఖ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి పథకం త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు. పనుల వేగవంతానికి త్వరలో ఇంజినీరింగ్, వ్యవసాయ అధికారులతో సమావేశమవుతామన్నారు.

త్వరలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. ఏ పొలంలో ఏ పంట వేస్తే రైతులకు లాభం అనేదానిపై కసరత్తు జరుగుతుంది. రైతుబంధు నిరంతరం కొనసాగుతుంది. అపోహలు వద్దు. వచ్చే ఏడాది రైతులందరికీ పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల పంపిణీకి కృషి చేస్తున్నాం. పాలమూరు-రంగారెడ్డి పథకానికి నష్టం జరగనివ్వబోము. రాష్ట్రంలో వ్యవసాయరంగం అద్భుతంగా విస్తరిస్తోంది. సొసైటీలు, బ్యాంకులకు చేతినిండా పని ఉంటుంది. రైతు ఉత్పత్తులు పెరుగుతున్నాయి - సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్​ చేశారు. ఈ విషయంలో రాజకీయాలకతీతంగా పార్టీలు కలిసి రావాలిని కోరారు.

ఇవీ చూడండి: అశ్వారావుపేట చెక్‌పోస్టు వద్ద భారీగా నిలిచిన వాహనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.