జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ దేవస్థానానికి వెళ్తున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డికి దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామానికి వచ్చిన మంత్రులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి నమూనాను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి చూపించి... నిధులు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
అన్న సాగర్లోని రెండు పడక గదుల ఇళ్లను మంత్రులు సందర్శించారు. ఆల వెంకటేశ్వర్ రెడ్డి తండ్రి రఘుపతి రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం మంత్రులంతా జోగులాంబ గద్వాల దేవస్థానానికి పయనమయ్యారు.