ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఒడిశా, తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన 10,255 మంది వలస కూలీలు మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల, బాలానగర్, భూత్పూర్ తదితర మండలాల్లోని పరిశ్రమల్లో పని చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతుండడం వల్ల ఇప్పటికే అంతర్జాలం ద్వారా నమోదు చేసుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో వివిధ పరిశ్రమల్లో పని చేసే 169 మంది వలస కూలీలను జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌లోని బొల్లారం రెల్వే స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన శ్రామిక్ రైలు ద్వారా వీరు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి వెళ్లనున్నారు.
ఇవీ చూడండి: లక్షకు పైగా వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు చేర్చిన దక్షిణ మధ్య రైల్వే