ETV Bharat / state

Mega IT Job Mela in Mahabubnagar : మహబూబ్​నగర్​లో మెగా ఐటీ జాబ్​ మేళా.. తరలివచ్చిన నిరుద్యోగులు - మహబూబ్​నగర్ ఐటీ హబ్​ తాజా వార్తలు

Mega IT Job Mela in Mahabubnagar : మహబూబ్‌నగర్ ఐటీ కారిడార్‌లో ఉద్యోగాల కోసం పట్టణంలో... తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్ నాలెడ్జ్‌ నిర్వహించిన జాబ్ మేళా... చదువుకున్న యువతలో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ఐటీ కారిడార్ నుంచి సేవలు ప్రారంభించేందుకు పది కంపెనీలు ముందుకు రాగా... 650 ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకే పరిమితమైన ఐటీ రంగం... మహబూబ్ నగర్‌ లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించటం పట్ల యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Mega IT Job Mela in Mahabubnagar
Mega IT Job Mela
author img

By

Published : Aug 10, 2023, 8:58 AM IST

Updated : Aug 10, 2023, 9:42 AM IST

Mega IT Job Mela in Mahabubnagar : ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఇప్పటికే కరీంనగర్, ఖమ్మం సహా మహబూబ్‌గర్, సిద్దిపేట, నిజామాబాద్ లాంటి నగరాల్లోనూ ఐటీ కారిడార్‌లను ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో నల్గొండ, వనపర్తి, ఆదిలాబాద్ లాంటి జిల్లాలకు కూడా ఐటీ సేవలను విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌గర్ ఐటీ కారిడార్ నుంచి 10 కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు శిల్పారామంలో ఆయా కంపెనీలు జాబ్ మేళా నిర్వహించగా... పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత తరలివచ్చింది. ఈ మేరకు మహబూబ్‌నగర్ ఐటీ కారిడార్(Mahabubnagar IT Hub) నుంచి పలు కంపెనీలు త్వరలోనే తమ కార్యకలాపాలు మొదలు పెడతాయని కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు.

Mahabubnagar IT Hub Job Mela : ఐటీ కొలువులంటే సొంత ఊరు వదిలి ఉద్యోగం కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటి ఇబ్బంది లేకుండా ఉన్న ఊర్లోనే ఉద్యోగాలు అవకాశాలు కల్పించటం పై మహబూబ్‌నగర్ యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ కొలువుకు అవసరమైన నైపుణ్యాలు ఇక్కడి అభ్యర్థులకు ఉండవు కాబట్టి... ఐటీ కొలువులు సాధించాలని భావించే యువతకు ప్రత్యేక శిక్షణ కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరిన్ని కంపెనీలు వస్తే యువతకు అపార ఉపాధి అవకాశాలు దక్కుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

'ఇక్కడ ఐటీ మెగా జాబ్స్ పడుతున్నాయని తెలిసి మా అందరికీ ఇక్కడ జాబ్స్ దొరుకుతాయనే ఆశతో మేమందరం ఐటీ జాబ్ మేళాకు వచ్చాం. మేం మహబూబ్​నగర్ వాసులమే కాబట్టి మాకు ఇక్కడే జాబ్స్ వస్తాయనుకుంటున్నాం. ఎక్కడికో పోకుండా మా దగ్గరనే ఐటీ జాబ్స్ కల్పించడం సంతోషంగా ఉంది. ఇక్కడే మా పేరెంట్స్​తో కలిసి ఉంటూ జాబ్ చేసుకుంటూ జిల్లాను డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు మహబూబ్​నగర్​ అంటే వలసలు ఉండేవి. ఇప్పుడు ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తుండడం ఆనందంగా ఉంది. ఒకప్పుడు ఐటీ జాబ్స్​కి వెళ్లాలంటే బెంగళూరు, చెన్నై హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది కానీ ఇప్పుడైతే మహబూబ్​నగర్​లోనే ప్లేస్​మెంట్ కల్పిస్తామని చెప్తున్నారు.'- జాబ్ మేళాకు హాజరైన నిరుద్యోగులు

KTR To Inaugurate Nizamabad IT Hub : నిజామాబాద్​లో​ ఐటీ టవర్​ను ప్రారంభించిన కేటీఆర్.. నిరుద్యోగులకు హామీ​

Minister Srinivas Goud Speech at IT Job Mela : ఒకప్పుడు పాలమూరు అనగానే వలసలు, నిరక్షరాస్యత, పేదరికం గుర్తొచ్చేదని... రాష్ట్రావిర్భావం తర్వాత ఉపాధికి చిరునామాగా మారిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) అన్నారు. శిల్పారామం(Job Mela at Shilparamam)లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన... 650మంది స్థానిక నిరుద్యోగ యువతకు మేళా ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 2న నిర్వహించే మెగాజాబ్ మేళాలో జిల్లాలోని 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో దివిటిపల్లి వద్ద ఐటీ కారిడార్​ను ఏర్పాటు చేశామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 650 ఉద్యోగాల కోసం 6వేల మందికిపైగా మౌకిక పరీక్షలకు హాజరయ్యారంటే మహబూబ్‌నగర్​లో ఉద్యోగాల కోసం ఎంతమంది యువత ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ మేరకు సెప్టెంబరు రెండో తేదీన సుమారు పదివేల ఉద్యోగాల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Siddipet IT Hub Inauguration : 'తెలంగాణ మోడల్‌ అంటే సమగ్ర, సమ్మిళిత, సమీకృత, సమతుల్య అభివృద్ధి'

"డిజిటైజ్, డీకార్బనైజ్, డీసెంట్రలైజ్ అన్న త్రీడీ మంత్రం నెరవేరుతోంది"

Case on Minister Srinivas Goud : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు షాక్‌.. ఆ వివాదంలో కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Last Updated : Aug 10, 2023, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.