ఆడపిల్లల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి లాంటి పథకాలను ప్రవేశపెట్టిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాబోయే మంత్రి వర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పించనున్నట్లు సీఎం ప్రకటనను గుర్తు చేశారు. మహబూబ్‌నగర్‌లో గైనకాలజీ వైద్యులు ఏర్పాటు చేసిన సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు.
ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైంది మహిళలైతే.. పురుషులు పదవుల్ని అనుభవించడం సిగ్గుచేటన్నారు. మహిళల్ని ఎదగనిచ్చినప్పుడే రాజకీయాలపైనా వారికి విశ్వాసం ఏర్పడుతుందని తద్వారా సుపరిపాలనలోనూ భాగస్వాములు అవుతారని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చదవండి:అమెజాన్‌లోకి నూయీ