మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మద్దతు తెలిపారు. ఆర్టీసీతో అమ్ముకోవాలనే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. న్యాయస్థానానికి తప్పుడు నివేదికలు ఇచ్చేందుకు అధికారులతో తొమ్మది గంటలు సమావేశం పెట్టిన కేసీఆర్.. తొమ్మిది నిమిషాలు ఆర్టీసీ కార్మికులకు కేటాయించి సమస్య పరిష్కరించవచ్చన్నారు. ఆర్టీసీ పుట్టుకతోనే ప్రభుత్వ రంగ సంస్థగా ఉందని, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక కార్పొరేషన్‌గా మారిందనే విషయాన్ని గమనించాలన్నారు.
ఇదీ చూడండి: కూతురు మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య