ప్రమాదవశాత్తు.. రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాలు ఒక్కసారిగా నేలకూలాయి. అదే సమయంలో రోడ్డుపై సైకిల్ మీదుగా వెళ్తున్న ఓ వ్యక్తిపై పడడం వల్ల అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో చోటు చేసుకుంది.
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని జీనుగురాల గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కాంక్రీట్ కలిపే యంత్రం ఢీకొని వరుసగా మూడు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అదే సమయంలో సైకిల్‌పై వెళ్తున్న ఆంజనేయులుపై పడ్డాయి. తీవ్రగాయాలతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. యంత్ర చోదకుడి నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.