కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారమే కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ కొనసాగుతుందని మహబూబ్‌నగర్ జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నంద్లాల్ తెలిపారు. జిల్లాలోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా అందించడం కోసం చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
కరోనా టీకా అందించడం కోసం జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్ తేజస్ నంద్లాల్ తెలిపారు. రెండు కేంద్రాలను జిల్లా కేంద్రంలో, ఒక కేంద్రాన్ని గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ అందించే ప్రక్రియపై కొనసాగుతున్న ఈ డ్రై రన్‌లో లబ్దిదారులను గుర్తించడం, రిజిస్త్రేషన్, వ్యాక్సినేషన్ ఇవ్వటం, అబ్సర్వేషన్‌లో ఉంచడం వంటి అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా మూడు లేదా నాలుగు దశల్లో అందరికి వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలోని 7 ప్రాంతాల్లో కొవిడ్ టీకా డ్రై రన్