ETV Bharat / state

ఉల్లి సాగులో ఆ రైతులు ఆదర్శం! - తెలంగాణ వార్తలు

ధరలు తగ్గితే రైతులకు, ధరలు పెరిగితే వినియోగదారులకు ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తుంది. ప్రకృతి వైపరిత్యాలు, వర్షాలు, తెగుళ్లు పట్టి పీడిస్తున్నా.. పెట్టిన పెట్టుబడులు మీద పడి అప్పుల పాలవుతున్నా.. తిరిగి అదే పంటను మూడు దశల్లో సాగుచేస్తూ అప్పుల ఊబిలోకి వెళ్లకుండా ఏళ్ల తరబడి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు పెద్ద గోప్లాపూర్ ఉల్లి రైతులు. అది ఎలా అంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే మరి!

mahabubnagar-farmers-onion-farming-special-story
ఉల్లి సాగులో ఆ రైతులు ఆదర్శం!
author img

By

Published : Dec 27, 2020, 8:02 PM IST

నష్టపోయిన చోటనే లాభాలను వెతుక్కుంటూ ఉల్లి సాగులో నిమగ్నం అవుతుంటారు ఆ రైతులు. మంచి లాభాలు ఆర్జిస్తూ... తోటి ఉల్లి రైతులకు విత్తనాలు, నారు రూపంలో అందిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఉల్లి సాగులో తమకు తెలిసిన మెళకువలు నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు గోప్లాపూర్ రైతులు.

40ఏళ్లుగా...

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో 167వ జాతీయ రహదారికి ఇరువైపులా వ్యవసాయం పొలాలు ఉన్న దేవరకద్ర మండలంలోని పెద్ద గోప్లాపూర్ రైతులు 40 ఏళ్లుగా ఉల్లిని సాగు చేస్తున్నారు. మూడు దశల్లో పండిస్తూ.. సాధారణం, సాధారణం కంటే ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. జాతీయ రహదారి కి అనుకుని పొలాలు ఉండడమే వీరికి వరంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు సులభంగా గ్రామానికి చేరుకొని.. నారు తీసుకుని వెళుతుంటారు. దేవరకద్ర మండలంలోని పెద్ద గోప్లాపూర్, గూర కొండ గ్రామాలకు చెందిన.. సుమారు 40 నుంచి 50 కుటుంబాలు ఉల్లిని విత్తనాలుగా, ఉల్లి నారును సాగు చేసి రైతులకు, పంట పండించి వినియోగదారులకు విక్రయిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు.

విత్తనాలతో...

అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉల్లిని నాటి విత్తనాల కోసం సాగు చేస్తారు. అలా సాగు చేసిన పంట తదుపరి ఏడాదికి విత్తనాల రూపంలో రైతులకు లాభాలను తెచ్చి పెడతాయి. కిలో విత్తనాలను కనిష్ఠంగా రూ.వెయ్యి నుంచి మూడు వేల వరకు విక్రయిస్తుంటారు.

ఉల్లి నారు రూపంలో...

ఉల్లి నారుకి అక్టోబర్ చివరి వారం నుంచి డిసెంబర్ వరకు డిమాండ్ ఉంటుంది. సాగుచేసిన ఉల్లి నారు 45 రోజులకు నాటేందుకు సిద్ధమవుతోంది. ఇలా సిద్ధమైన నారు తీసుకొని వెళ్లేందుకు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్​నగర్, జడ్చర్ల, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల ఉల్లి రైతులు నారు తీసుకొని వెళ్లి నాటుతారు.

మడికి రూ.1000 నుంచి రూ. 3500:

సిద్ధం చేసిన 45 రోజుల ఉల్లి నారును ఎదుగుదల, విస్తీర్ణాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి 3,500వరకు రైతులే ధరను నిర్ణయిస్తారు. అలా నిర్ణయించిన ధరలను బట్టి నచ్చిన రైతులకు అడ్వాన్సులు ఇచ్చి... 45 రోజుల అనంతరం నారు తీసుకెళ్తారు. ఇలా పెద్ద గోప్లాపూర్, గూరకొండ గ్రామాల్లోని సుమారు 40 నుంచి 50 కుటుంబాల రైతులు... ఉల్లి నారును అర ఎకరా నుంచి ఎకరా వరకు సాగు చేయడం ద్వారా దాదాపు రెండు నెలల్లో రూ.50 వేల నుంచి లక్ష వరకు లాభాలను ఆర్జిస్తారు.

ఆదర్శం...

సాగుచేసిన ఉల్లిని ప్రతి బుధవారం.. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లో విక్రయిస్తూ ఏడాదిలో సుమారు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ఉల్లిని పండిస్తారు. మంచి లాభాలు పొందుతూ తోటి ఉల్లి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతుల డిమాండ్ మేరకు టమాటా, వంకాయ నారుతో పాటు వివిధ రకాల ఆకుకూరలు, కాయగూరలను సాగుచేస్తూ ఏడాదిపాటు లాభాలను ఆర్జిస్తున్నారు.

ఇదీ చదవండి: 2020 రౌండప్​: లాక్​డౌన్​.. వరదలు.. జలజగడాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.