దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో క్రమం తప్పకుండా వాడే మందులకు, జ్వరం, దగ్గు, జలుబు, నొప్పులు, విరేచనాల్లాంటి సాధారణ జబ్బుల మందులకు ప్రస్తుతం డిమాండ్ పెరుగుతోంది. ఎందుకైనా మంచిదని ముందుగానే కావాల్సిన మందులను కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు జనం. శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజుల్లాంటి వాటికి సైతం డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యవసర మందుల లభ్యత, ధరల నియంత్రణ, కోవిడ్-19 నేపథ్యంలో మందుల దుకాణాలు పాటించాల్సిన నిబంధనలపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఔషద నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు రాజవర్ధనాచారితో మా ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి.