ETV Bharat / state

లాక్​డౌన్​తో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోయింది: కలెక్టర్

author img

By

Published : Jun 1, 2021, 5:20 PM IST

కరోనా కట్టడిలో ప్రజలు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని మహబూబ్ నగర్ కలెక్టర్ వెంకట్​రావు కోరారు. స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి దేవరకద్ర పీహెచ్​సీని సందర్శించారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఇన్సెంటివ్ కేర్ సెంటర్​కు అవసరమైన సౌకర్యాలపై వైద్యులతో చర్చించారు.

mahabubnagar collector
mahabubnagar collector

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పీహెచ్​సీని కలెక్టర్ వెంకట్​రావు సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి.. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఇన్సెంటివ్ కేర్ సెంటర్​కు అవసరమైన సౌకర్యాలపై వైద్యులతో చర్చించారు. నియోజకవర్గంలోని 5 పీహెచ్​సీలకు ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను అందజేసిన స్థానిక స్నేహ ఫౌండేషన్ నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

జిల్లాలో లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేయడంతో 34 శాతం ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య.. 7 శాతానికి పడిపోయినట్లు కలెక్టర్ తెలిపారు. కరోనా కట్టడిలో ప్రజలు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా. కృష్ణ, ఇతర వైద్యాధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: KTR Respond: యువకుడి ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.