నామినేషన్ ప్రక్రియలో నిబంధనలు పాటించండి: రొనాల్డ్ రోస్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం మహబూబ్ నగర్ పురపాలిక ఎన్నికలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభించామని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. మహబూబ్ నగర్, భూత్పూర్ పురపాలిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకులు పౌసోమి బసుతో కలిసి పరిశీలించారు. నామపత్రాల దాఖలు చేసే ప్రక్రియలో నిబంధనలను అనుసరించాలని ఆదేశించారు. అభ్యర్థులు నామపత్రాల దాఖలు చేసేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగిందని.. 49 వార్డులకు గాను 17 కౌంటర్లు ఏర్పాటు చేశామని రొనాల్డ్ రోస్ పేర్కొన్నారు. ఒక్కో కౌంటర్లో మూడు వార్డులకు సంబంధించిన నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ప్రాపర్టీ టాక్స్ కట్టేందుకు, నో డ్యూ సర్టిఫికెట్స్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ