ETV Bharat / state

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: చర్యలు వేగవంతం

author img

By

Published : Nov 28, 2020, 10:57 AM IST

పాలమూరు - రంగారెడ్డి జలాశయ నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని ఈటీవీ భారత్​లో ప్రచురితమైన కథనాలకు మహబూబ్ నగర్ కలెక్టర్ స్పందించారు. సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి... తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

mahabubnagar collector review on palamuru rangareddy project
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: చర్యలు వేగవంతం

మహబూబ్​నగర్ జిల్లాలో చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటరావు ఆదేశించారు. భూసేకరణలో జాప్యం జరగడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

జడ్చర్ల నియోజకవర్గంలో ఉదండాపూర్ ప్రారంభించిన ప్రాజెక్ట్ భూ సేకరణ పూర్తి కాకపోవడం పట్ల ఆరంభ శూరత్వం - ఆనక అలసత్వం శీర్షికతో ప్రచురితమైన కథనాలపై ఆయన స్పందించి... అధికారులతో సమీక్షించారు.

అదనపు కలెక్టర్, ఆర్డీవో, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎస్ఈఈతో పాటు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్యత ఉన్న పనులు మొదట చేపట్టి... మిగతా వాటిని చివరకు పూర్తి చేస్తారని వివరించారు. భూసేకరణ చేపట్టినట్టు ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: చిన్నపాటి వర్షాలకే.. నాణ్యతా లోపాలు గుట్టురట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.