ETV Bharat / state

Mahabubnagar BRS Leaders Joining in Congress : పాలమూరు జిల్లాలో బీఆర్​ఎస్​కు షాక్​.. కాంగ్రెస్​లో భారీ చేరికలు

Mahabubnagar BRS Leaders Joining in Congress : ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్​లోకి వలసలు పెరుగుతున్నాయి. బీఆర్​ఎస్, బీజేపీ సహా ఇతర పార్టీల నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు హస్తంపార్టీ బాట పడుతున్నారు. తాజాగా కల్వకుర్తి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తన అనుచరగణంతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అచ్చంపేట నియోజక వర్గంలోనూ పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీలో జోష్‌ను పెంచుతున్నా.. టిక్కెట్ ఎవరకి దక్కుందనే ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది.

BRS Leaders Joining in Congres
BRS Leaders Joining in Congress in Mahabubnagar
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2023, 1:30 PM IST

Updated : Oct 7, 2023, 2:20 PM IST

Mahabubnagar BRS Leaders Joining in Congress పాలమూరు జిల్లాలో బీఆర్​ఎస్​కు షాక్​.. కాంగ్రెస్​లో భారీ చేరికలు

Mahabubnagar BRS Leaders Joining in Congress : ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో గడిచిన పదేళ్లలో బీఆర్​ఎస్​లో కీలక భూమిక పోషించి, ఈ ఎన్నికల్లో టిక్కెట్టు ఆశించి భంగపడ్డ నేతలంతా ప్రస్తుతం ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బాట పడుతున్నారు. టిక్కెట్టు దక్కించుకోవడమే లక్ష్యంగా తమ అనుచరులు, అసంతృప్తులతో హస్తం పార్టీలో చేరుతున్నారు. తాజాగా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ ఎంపీపీ కమ్లి మోత్యానాయక్, ఆమనగల్ ఎంపీపీ అనిత విజయ్, మరో 70మంది దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

BRS Leaders Joining in Congress Telangana : అచ్చంపేట నియోజక వర్గంలోనూ ఇద్దరు జడ్పీటీసీలు, ఓ ఎంపీపీ సహా పలువురు స్థానిక ప్రజాప్రతినుధులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. బీఆర్​ఎస్​లో టిక్కెట్టు ఆశించి భంగపడ్డ నేతలతో పాటు, మంత్రులు, శాసనసభ్యుల నుంచి పదవులు, పనులు ఆశించి భంగపడ్డ స్థానిక నాయకులు, రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థమైన వాళ్లు, భవిష్యత్తు కాంగ్రెస్‌దే అని నమ్మే కార్యకర్తలు ఒక్కొక్కరుగా హస్తం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు.

Telangana Congress Joinings 2023 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో నియోజక వర్గాల వారీగా గమనిస్తే కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, గద్వాల నియోజక వర్గం నుంచి జడ్పీ ఛైర్​పర్సన్ సరిత, వనపర్తి నియోజక వర్గం నుంచి మంత్రి నిరంజన్ రెడ్డికి ప్రధాన అనుచరునిగా ఉన్న పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, కొడంగల్ నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఇలా కీలకమైన నేతలంతా కాంగ్రెస్‌లో చేరారు. క్షేత్రస్థాయిలో బలమైన నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్​ఎస్​ను వీడటం గులాబీ దళానికి కాస్త మింగుడుపడని అంశమే. వచ్చే ఎన్నికల్లో ఓట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Telangana Congress Clashes : కాంగ్రెస్‌లో కాక రేపుతున్న చేరికలు.. సీనియర్లు వర్సెస్ జూనియర్లతో పార్టీకి తలనొప్పి

అధికార పార్టీ మాత్రమే కాదు.. బీజేపీ సహా ఇతర పార్టీల నుంచి కూడా హస్తం పార్టీకి వరుస కడుతున్నారు. మహబూబ్​నగర్ నియోజక వర్గంలో బీజేపీలో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సైతం ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రముఖ న్యాయవాది, బీసీ నాయకుడు వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేవరకద్ర, మక్తల్ నియోజక వర్గాల్లో తమకంటూ ప్రత్యేకమైన అనుచరగణం ఉన్న తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి సతీమణి సీతాదయాకర్ రెడ్డి సైతం తమ రాజకీయ భవిష్యత్తు కోసం హస్తంపార్టీ వైపే మొగ్గుచూపారు.

Congress Election Strategy Telangana : బీఆర్​ఎస్​ను ఓడించటమే లక్ష్యంగా పార్టీలో చేరుతున్న వారందరినీ కాంగ్రెస్ అక్కున చేర్చుకుంటోంది. కాంగ్రెస్​లో కొత్తగా చేరిన వాళ్లలో ఎక్కువమంది టిక్కెట్టు ఆశించి ఇతరపార్టీల నుంచి వలస వచ్చిన వాళ్లే. ఈ నేపథ్యంలో వీళ్లలో ఎంతమందికి టిక్కెట్ దక్కుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. కొత్తవారికి టిక్కెట్లిస్తే పాత నాయకులు వారికి సహకరిస్తారా అన్నది ప్రశ్నార్థమే. ఎంతమంది నాయకులు కాంగ్రెస్​లో చేరినా, సర్వేల ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని అధిష్ఠానం స్పష్టం చేస్తోంది. .

Telangana Congress MLA Candidates List Delay : కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం.. అప్పటిదాకా ఆగాల్సిందే..!

మరోవైపు ప్రతి జిల్లా లేదా ఉమ్మడి జిల్లా యూనిట్​గా బీసీలకు కూడా ప్రాధాన్యం దక్కేలా టిక్కెట్లు కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. సర్వేలు, రాజకీయ, సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు అన్నింటినీ బేరీజు వేసుకుని తీరా అభ్యర్ధులను ప్రకటించాకా... అందరూ ఒక్కతాటిపై నిలిచి అభ్యర్ధిని గెలిపిస్తారా అన్నది కూడా సంశయమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి పెరుగుతున్న వలసలు పార్టీని బలోపేతం చేస్తాయా? చేటు తెస్తాయా? ఎన్నికలు ముగిసే వరకూ వేచిచూడాల్సిందే.

Telangana Congress Bus Yatra 2023 : ఈనెల 14 నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర.. 18న రాష్ట్రానికి రాహుల్ గాంధీ

Congress Flash Survey Telangana : ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక మీద మరో లెక్క.. టెన్షన్​లో కాంగ్రెస్​ సీనియర్​ నేతలు

Last Updated : Oct 7, 2023, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.