ETV Bharat / state

కంటైన్మెంట్​ జోన్​లో పర్యటించిన జిల్లా కలెక్టర్​ - మహబూబ్​ నగర్​

కంటోన్మెంట్ ప్రాంతాలకు వెళ్లే వారంతా వైరస్  బారిన పడకుండా పూర్తి రక్షణతో వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కంటైన్మెంట్ జోన్లను ఆయన పరిశీలించారు.

Mahabub Nagar District Collector Visits Containment Zones In Town
కంటైన్మెంట్​ జోన్​లో పర్యటించిన జిల్లా కలెక్టర్​
author img

By

Published : Jul 19, 2020, 8:46 PM IST

మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలో కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిన టీచర్స్ కాలనీ, మర్లు, క్రిస్టియన్ పల్లి ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ వెంకట రావు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో జిల్లా అధికారులు, వైద్య బృందాలతో కలిసి పరిశీలించారు. కంటైన్మెంట్ ప్రాంతాలలో ఉండే ప్రజలతో మాట్లాడుతూ అందుతున్న సౌకర్యాలు, పాజిటివ్ వచ్చిన వారికి అందుతున్న వైద్యసేవలు, ఇతర అంశాలపై అడిగి తెలుసుకున్నారు.

కంటైన్మెంట్ జోన్లలో పని చేసే సిబ్బంది మాస్కులు, గ్లౌజులు ధరించి విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పాజిటివ్ వచ్చిన వారి ఇంటి చుట్టుపక్కల ఇళ్ళను కలుపుకొని కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయాలని.. ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఆయా జోన్ల నుంచి ప్రజలు బయట తిరగకుండా చూడాలని సూచించారు.

ఇదీ చూడండి:- 'కరోనా వేళ ఎన్నికల నిర్వహణకు సూచనలు ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.