మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజులో భాగంగా అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయమే మహిళలు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీదేవి రూపంలో ఉన్న వాసవీ మాతకు ప్రత్యేక కలశ పూజలను నిర్వహించారు. లలితా సహస్ర నామాలను పటిస్తూ కుంకుమార్చన చేశారు. కళశాలతో చేతిలో పట్టుకొని పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు.
ఇవీ చూడండి: అలా వరదలో కొట్టుకుపోయాడు... ఇలా బయటకొచ్చాడు