పుష్పమాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని ఆలయంలో పెద్దఎత్తున మహిళలు పూజలో పాల్గొన్నారు.
మహిళలు పలు రకాల పూలతో స్వామి వారి నామాన్ని స్మరిస్తూ పుష్పార్చన చేశారు. అంతకు ముందు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు ముగిశాక భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.