మహబూబ్ నగర్ గ్రామీణ మండలం రామచంద్రపురం గ్రామంలో ప్రాదేశిక ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థి ఎంపీటీసీగా గెలుపొందారు. రాత్రి ఓటమి పాలైన అభ్యర్థి తరఫు యువకులు, గెలిచిన వారి మధ్య వాగ్వాదం జరిగింది. మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. అటు మహిళల మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవలో ఓ మహిళను తోసేయడం వల్ల కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. ముగ్గురు యువకులకు గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు.
ఉద్రిక్తత
మృతి చెందిన మహిళ మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు. దింతో మరోసారి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. గ్రామాన్ని సందర్శించిన ఎస్పీ రమా రాజేశ్వరి నిందితులపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. అయినా నిందితులను అరెస్ట్ చేసే వరకు మృతదేహాన్ని తరలించేది లేదంటూ పట్టుబట్టారు. గ్రామంలో ఏలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి: మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయ హత్య