Mahabubnagar News : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ శిబిరంలో సదుపాయాలు కొరవడ్డాయి. మూడేళ్ల తరవాత కు.ని. బటన్‌హోల్ శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించడంతో మహిళలు పెద్దఎత్తున వచ్చారు. కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం గుడారం కూడా ఏర్పాటు చేయలేదు. ఆపరేషన్ తర్వాత హాలులో కొంతసేపు విశ్రాంతి తీసుకున్న మహిళలు అనంతరం బయటకొచ్చి ఆసుపత్రి ఆవరణలో చెట్ల కింద సీసీరోడ్డుపైనే పడుకొని సేదతీరాల్సి వచ్చింది.
- ఇదీ చదవండి : పాతాళానికి పడిపోతున్న పసుపు ధరలు.. ఆవేదనలో అన్నదాతలు