మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్లో కురుమూర్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీనివాసుని కల్యాణం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవిని ఆలయ నిర్వాహకులు పట్టు వస్త్రాలతో అలంకరించి కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు. బ్రాహ్మణోత్తముల వేదమంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం కమణీయంగా నిర్వహించారు. ఈ దృశ్యాన్ని భక్తులు తిలకించి పునీతులయ్యారు. అనంతరం శ్రీదేవి భూదేవికి భక్తులు ఒడి బియ్యం సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు.
ఇవీ చూడండి: జీవితంలో రాణించలేనేమోనని ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య