తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని అమ్మాపూర్ సమీపంలో కొలువుదీరిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు కరోనా నిబంధనల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. వంశాచారంగా ముక్కెర వంశీయులు... స్వామివారికి ఆభరణాలను అలంకరించడం ఆనవాయితీ.
స్వామివారి ఆభరణాలను ఊరేగింపుగా తీసుకొచ్చిన ముక్కెర వంశీయులు... కాంచన గుహలో శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువుదీరిన కురుమూర్తి స్వామికి.. నాడు చేయించిన ఆభరణాలను అలంకరించారు.
ఉత్సవాలు ముగిసే వరకు ముక్కెర వంశీయులు అలంకరించిన ఆభరణాలతో స్వామివారు దర్శనమివ్వనున్నారు. శనివారం జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం నిర్వహించనున్నారు. వేలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటం వల్ల ఆలయాధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇదీ చదవండి: 'వరదసాయం కింద కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు'