ETV Bharat / state

Toilet Problems: మంటగలుస్తున్న మహిళల ఆత్మగౌరవం... శౌచాలయాల్లేక ఇబ్బందులు - No toilets news

బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా... స్వచ్ఛభారత్‌లో తెలంగాణ దూసుకుపోతున్నా... అక్కడ మాత్రం శౌచాలయాలు (Toilet Problems) లేక మహిళల ఆత్మగౌరవం మంటగలుస్తోంది. చిన్నపిల్లల దగ్గర్నుంచి పండు ముసలి వరకూ బహిరంగ ప్రదేశాల్లోనే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోంది. సమస్య గురించి తెలిసినా పరిష్కారం చూపడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అలసత్వం వహిస్తున్నారు.

ఆత్మగౌరవం
Problems
author img

By

Published : Nov 25, 2021, 5:10 AM IST

మంటగలుస్తున్న మహిళల ఆత్మగౌరవం... శౌచాలయాల్లేక ఇబ్బందులు

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ (Alampur)పురపాలిక సంత మార్కెట్ కాలనీలో సుమారు 150కి పైగా కుటుంబాలు జీవిస్తుంటాయి. వారిలో 70 శాతానికి పైగా ఎస్సీ కుటుంబాలు. రెక్కాడితే గాని డొక్కాడని బీడీ కార్మికుల కుటుంబాలు ఇంకొన్ని. వారి ఇళ్లలో ఇప్పటికీ మరుగుదొడ్లు (Toilet Problems) లేవు. మలమూత్ర విసర్జన కోసం మహిళలంతా బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లాల్సిందే.

ఒకప్పుడు అలంపూర్‌కోట చుట్టూ కందకాలు ఉండటంతో అక్కడకు వెళ్లేవారు. పట్టణ ప్రగతి పేరిట ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడంతో చాటు లేకుండా పోయింది. ప్రస్తుతం మరుగుదొడ్డికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకొని బహిరంగ ప్రదేశాల్లోనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు.

స్థలం ఉన్నా...

సొంతంగా మరుగుదొడ్లు నిర్మించుకుందామన్న వారికి ఆ అవకాశం లేదు. సంత మార్కెట్ కాలనీలో ఇళ్లు ఇరుకైనవి. నలుగురు సభ్యులున్న కుటుంబం... ఆ గదుల్లో నివాసం ఉండటమే కష్టం. మరుగుదొడ్డికి చోటులేని దుస్థితి వారిది. స్థలం ఉన్నా గుంతలు తవ్వితే బండరాయి పడటంతో మరుగుదొడ్ల నిర్మాణాలు నిలిపివేశారు.

ఆ సమస్యకు పరిష్కారంగా ఆ కాలనీ వాసులందరికీ మరోచోట సామూహిక మరుగుదొడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరైనా... అమలుకు నోచుకోలేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా మహిళలు సహా అక్కడి కుటుంబాలు నరకయాతన అనుభవిస్తున్నాయి. ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకుండా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు కోరుతున్నారు.

ఇదీ చూడండి: స్వతంత్ర అభ్యర్థి నామినేషన్​ తిరస్కరణ... ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.