ETV Bharat / state

చిన్నారులపై తేనెటీగల దాడి... ఒకరికి ప్రాణాపాయం

పాఠశాల ఆవరణలో తోటి విద్యార్థులతో కలిసి ఆడుకుంటున్నారు. ఆటలో మైమరిచిపోయి ఉన్న వారిపై అకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేశాయి. ఒక్కసారిగా తేనెటీగలు దాడిచేయడంతో ఆ చిన్నారులు ఉక్కిరిబిక్కిరయ్యారు.

author img

By

Published : Jul 6, 2019, 3:25 PM IST

చిన్నారులపై తేనెటీగల దాడి... ఒకరికి ప్రాణాపాయం
చిన్నారులపై తేనెటీగల దాడి... ఒకరికి ప్రాణాపాయం

మహబూబ్​నగర్​ జిల్లా కోయిలకొండ మండలం సూరారంలో పాఠశాల విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 24 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఒక్కసారిగా తేనెటీగలు మీదకు రావడంతో చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. గమనించిన ఉపాధ్యాయులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో 23 మంది పిల్లల వార్డులో చికిత్స పొందుతున్నారు. ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

Intro:TG_Mbnr_03_06_Thenethigalu_Daadi_On_Students_AB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్, మహబూబ్ నగర్

( ) పాఠశాల విద్యార్థుల పై తేనే టీగలు దాడి చేయగా 24 మంది విద్యార్థులు గాయాలపాలయ్యిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం సూరారం గ్రామంలో చోటు చేసుకుంది.

Body:సూరారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఆడుకుంటుండగా వారిపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఎక్కువ మొత్తంలో దాడి చేయడంతో 24 మంది చిన్నారులు గాయాలపాలయ్యారు. ఇది గమనించిన ఉపాధ్యాయులు వారిని హుటాహుటిన కోయిలకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు, అనంతరం మెరుగైన చికిత్స కోసం మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.

Conclusion:గాయపడిన విద్యార్థులలో 23 మంది చిన్నారులు పిల్లల వార్డులో చికిత్స తీసుకుంటుండగా వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.......బైట్
పుష్ప కుమారి, ప్రధానోపాధ్యాయురాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.