ETV Bharat / state

వందల ఏళ్ల చెట్లు తొలగించారు... మళ్లీ నాటారు.. ఎలాగంటే! - Trees Translocation Method in Mahabubnagar

Trees Translocated in Mahabubnagar: ఒక చెట్టును నరికినంతగా ఈజీగా వాటిని పెంచలేం. మానవుడి స్వలాభం కోసం అడ్డగోలుగా వృక్షసంపదను తొలగిస్తూనే ఉన్నాడు. ఈ పరిస్థితిలో మార్పు లేకుంటే... వచ్చే అనర్థాలు భావి తరాలతో పాటుగా మనకు లేకపోలేదు. చెట్లను పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పథకం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వంటి కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అయితే అత్యవసరమైన పరిస్థితుల్లో వందల సంవత్సరాల చెట్లను తొలగించాల్సి వస్తోంది. వాటిని అలానే వదిలేయకుండా.. వాటి ప్రాణం నిలబెడుతున్నారు. వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న చెట్లను నేలకొరిగించకుండా వాటిని వేరే ప్రాంతాలకు తరలించి 'ట్రీస్ ట్రాన్స్ లోకేషన్' పద్ధతిలో సజీవంగా ఉంచుతున్నారు. ఈ పద్ధతిలో మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో 150 ఏళ్ల చరిత్ర కలిగిన 5 వృక్షాలను ట్రాన్స్ లోకేషన్ విధానం ద్వారా ఒక్క రోజులోనే తరలించి మయూరి పార్కు ఆవరణలో వాటికి పునర్జీవం పోశారు.

Trees
Trees
author img

By

Published : Apr 20, 2022, 1:51 PM IST

వందల ఏళ్ల చెట్లు తొలగించారు... మళ్లీ నాటారు.. ఎలాగంటే!

Trees Translocated in Mahabubnagar: సాధారణంగా మొక్కలను నాటుతుంటాం. ఇళ్లలో, రహదారుల వెంట, ఖాళీ స్థలాల్లో, అడవుల్లో వాటిని నాటడం ఆనవాయితీ. కాని.. 150 ఏళ్ల వయస్సు కలిగిన భారీ వృక్షాలను నాటడం విశేషం. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల అతిథి గృహం ఆవరనలో ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను వాటి కొమ్మలను నరికి మొదలు,కాండం, వేర్లతో వాటిని భూమిలో నుంచి వెలికి తీసి తిరిగి వాటిని జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న మయూరి అర్బన్‌ ఎకో పార్క్‌ ఆవరణలో నాటారు. అతిథి గృహం స్థలంలో కూరగాయలు, మాంసం, ఇతర అవసరాల కోసం అధునాతన మార్కెట్‌ను నిర్మిస్తున్నారు.

ప్రాణం నిలిపేలా: ఈ మేరకు అక్కడ భవనాలను నిర్మించడానికి అనువైన ప్రదేశం ఉన్నా... అందులో 150 ఏళ్ల వయస్సు పైబడిన 5 పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. భవన నిర్మాణానికి అవి అడ్డు వస్తున్నాయి. భారీ చెట్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా భవనాన్ని నిర్మించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోషకుమార్‌కు సమాచారం చేరగా.. చెట్లను మరో ప్రాంతంలో నాటే విధంగా చర్యలు చేపట్టాలని వట ఫౌండేషన్’ ప్రతినిధులకు సూచించారు. దీంతో భారీ లారీలు, పెద్ద క్రేన్‌ సహాయంతో ఒక్క రోజులోనే వాటిని తొలగించి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్క్‌ ఆవరణలో నాటారు. పెద్ద వృక్షాలను తిరిగి నాటడానికి మూడు రోజుల ముందుగానే ఏర్పాట్లు చేశారు. చెట్లను తిరిగి నాటిన తర్వాత అవి పునర్జీవం పొందేవిధంగా అవసరమైన రసాయనక చర్యలు చేపట్టారు. తిరిగి నాటిన ఈ చెట్లకు 45 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో చిగుళ్లు వస్తాయి. 5 ఏళ్లలో అవి సాధారణ చెట్లుగా మారతాయి.

వట ఫౌండేషన్‌ సహకారం: చెట్లకు ప్రాణప్రతిష్ఠ చేసే మహాయాగాన్ని తలకెత్తుకున్న వట ఫౌండేషన్ 2010లో ఏర్పాటైంది. ముగ్గురు మిత్రులు కలిసి స్థాపించిన ఈ సంస్థలో స్వచ్ఛందంగా వంద మందికి పైగా పని చేస్తున్నారు. సాధరణంగా రావి, మర్రిచెట్ల వంటి వాటిని మాత్రమే తిరిగి నాటేందుకు అవకాశం ఉన్నా... "వట ఫౌండేషన్" మాత్రం తొలగించాల్సి వచ్చిన ప్రతీ చెట్టును తరలించి పునర్జీవం పోసేందుకు చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ నిర్మాణాలైనటువంటి రహదారుల విస్తరణ, ప్లై ఓవర్‌ల నిర్మాణంలో అడ్డుగా వచ్చిన చెట్లను ఇదే తరహాలో నాటుతున్నట్లు తెలిపారు. చెట్లు వంద శాతం బతకాలంటే.. వర్షాకాలంలో ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉండేదన్నారు. కాని, అత్యవసరం కావడంతో... చెట్లను బతికించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వాటిని తరలించిన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో త్వరగా పెరిగే చెట్లను మాత్రమే నాటుతున్నారని.. ఇలాంటి చెట్లు పెరగాలంటే 50 ఏళ్లు పడుతుందన్నారు. మానవాళికి అవసరమయ్యే ఈ భారీ చెట్లను తొలగించకపోవటమే సబబని.. కానీ, తప్పని పరిస్థితుల్లో వాటిని తొలగించాల్సి వచ్చినప్పుడు తిరిగి నాటడం ఎంతో మేలన్నారు. ఒక భారీ చెట్టు... వెయ్యి చిన్న చెట్లతో సమానమని.. దీనికే పునర్జీవం పోస్తే 5 ఏళ్లలో తిరిగి యథాస్థితికి చేరుకుంటుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2వేల 500 వృక్షాలను ఒక ప్రాంతం నుంచి తీసి మరోక ప్రాంతంలో నాటినట్లు వారు తెలిపారు.

45 రోజుల్లో చిగురు: మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఉన్న ప్రభుత్వ భూమిలో సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణంలో భాగంగా 150 ఏళ్ల చరిత్ర గల వేప, కొండ మల్లె, వెలగపండు చెట్లు అడ్డుగా వస్తున్నాయి. వాటిని తొలగించేందుకు గుత్తేదారు నిర్ణయం తీసుకున్నా... ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి వాటికి పునర్జీవం పోసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాటిని తిరిగి నాటేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రక్రియ చేపట్టేందుకు కాస్త ఖర్చయినా.. భారీ చెట్లను కాపాడాలనే ఉద్దేశంతో తిరిగి నాటినట్టు పేర్కొన్నారు. సాంకేతిక పరిఙ్ఞానంతో మూడు రోజుల ముందే అవసరమైన ఏర్పాట్లు చేసుకుని ఒక్క రోజులోనే 5 చెట్లను సమీపంలోని మయూరి వనంలో నాటామన్నారు. ఇతర శాఖల సమన్వయంతో ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు 45 రోజుల్లో చెట్లు చిగురించేలా చర్యలు చేపడతామన్నారు.

చెట్లను తొలగించవద్దు: చెట్లను తీసేయకుండా ప్రభుత్వానికి అనేక ప్రత్యమ్నాయాలు ఉన్నాయి. కానీ, వాటిని నరకడం సులభం, చవకైన పరిష్కారం కావడంతో అభివృద్ధిలో భాగంగా భారీ చెట్లను తొలగిస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎన్ని చెట్లు నాటుతున్నా... స్థానిక మొక్కల రకాలను నాటకపోవడంతో అవి భారీ చెట్లతో సరితూగలేవు. ప్రస్తుతం నాటుతున్న చెట్లు వేగంగా పెరుగుతాయే తప్ప భారీ చెట్లకు సమానం కావని తెలిపారు. పర్యావరణ హితంగా ఉంటామని చెప్పుకుంటున్న ప్రభుత్వం అభివృద్ధి పేరుతో చెట్లను నరికేందుకు అనుమతి ఇవ్వకుండా.. వాటికి తిరిగి పురర్జీవం పోసి పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా కృషి చేయాలని పర్యవరణ ప్రేమికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.